Jul 23 2021 @ 12:34PM

నా సంగీతానికి ముగింపు లేదు: ఇళయరాజా

చిత్ర పరిశ్రమకు ఎంతమంది కొత్త సంగీత దర్శకులు వచ్చినప్పటికీ తన సంగీతానికి మాత్రం ముగింపు (నెవర్‌ ఎండింగ్‌) లేదని మ్యాస్ట్రో ఇళయరాజా అన్నారు. ఆయన కోడంబాక్కం హైరోడ్డులోని మహాలింగపురంలో కొత్తగా అధునాతన హంగులతో మ్యూజిక్‌ స్టూడియో నిర్మించిన విషయం తెల్సిందే. ఈ స్టూడియోలో గురువారం మీడియాతో ముచ్చటించారు. సంగీతం ఎలా ఉండాలో తెలియజేసిన ఆయన తన కుమారులు, మనవళ్లు గురించి కూడా మాట్లాడారు. 

‘‘ఇప్పటికే 1300కు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చాను. ఈ రంగంలో నా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. దీనికి ముగింపు అంటూ ఏదీ లేదు. నా కొత్త స్టూడియోలో ఎంతో మంది యువకళాకారులతో కొత్త చిత్రాలకు సంగీత రికార్డింగ్‌ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. అయితే, కరోనా కారణంగా  మ్యూజిక్‌ కంపోజింగ్‌ పనులు కాస్త నెమ్మదించాయి. అలాగే లాక్‌డౌన్‌ సమయంలో సంగీతం అనేది చాలా మందికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే బెస్ట్‌ మెడిసిన్‌గా ఉపయోగపడింది. రెండు దశాబ్దాల క్రితం కంపోజింగ్‌ చేసిన పాటలనే ఇప్పటికీ అనేక మంది మళ్ళీమళ్ళీ వింటున్నారు.  సంగీతం అనేది ఒక రోజు తర్వాత వాడిపోయే పువ్వులా ఉండకూడదు. అపుడే వచ్చిన మొగ్గలా ఉండాలి. ఎందు కంటే మనస్సు ఎపుడు కొత్తదనాన్ని కొరుకుంటుంది. అలాగే, సంగీతం అనేది ఎల్లవేళలా కొత్తగా ఆస్వాదించేలా ఉండాలి. నా  కుమారులు కార్తీక్‌ రాజా, యువన్‌ శంకర్‌ రాజాల పిల్లలైన యతీశ్వరన్‌, జియాలకు సంగీతం అనేది పుట్టుకలోనే ఉంది. అందుకే వారు ఇప్పుడే అందరి ప్రశంసలు అందుకుంటున్నారు’’అన్నారు ఇళయరాజా. 

Otherwoodsమరిన్ని...