Abn logo
Jan 20 2021 @ 10:50AM

కలెక్షన్లలో హాలీవుడ్‌ మూవీని బ్రేక్‌ చేసిన ఇళయదళపతి

చెన్నై: ఇళయదళపతి విజయ్‌, యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో ఈ నెల 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘మాస్టర్‌’ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ తర్వాత తమిళనాడు థియేటర్లలో విడుదలైన తొలి పెద్ద చిత్రమిది. ఈ చిత్రానికి అటు విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. తమిళంలోనే కాకుండా, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రానికి మిశ్రమ టాక్‌ వచ్చినప్పటికీ... ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రం విడుదలై వారం గడుస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో విడుదలైనప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు చూసి ప్రతి ఒక్కరు నోరెళ్ళబెడుతున్నారు.


ముఖ్యంగా విదేశాల్లో జనవరి 15 నుంచి 17వ తేదీల మధ్య ఈ మూవీ ఏకంగా 23 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల మేరకు రాబట్టి, మొదటిస్థానంలో నిలిచింది. ఇతర హాలీవుడ్‌ చిత్రాలతో పోల్చుకున్నప్పటికీ ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది. ‘మాస్టర్‌’ మూవీ తర్వాత ‘ఎ లిటిల్‌ రెడ్‌ ఫ్లవర్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం 11.75 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మన దేశంలో తొలి మూడు రోజుల్లోనే ఏకంగా వంద కోట్ల రూపాయలను సాధించిన విషయం తెల్సిందే.

Advertisement
Advertisement
Advertisement