May 7 2021 @ 00:10AM

ఇలియానా డిజిటల్‌ ఎంట్రీ

ఓ పక్కన వెండితెరపైన రాణిస్తూనే డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నారు పలువురు సినీ తారలు. సినిమాలు చేస్తూనే, వెబ్‌సిరీస్‌లు, టాక్‌ షో లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగులో నటి సమంత, హిందీలో నేహాదూపియా ఆ విషయంలో బాగా సక్సెసయ్యారు. ఇప్పుడు ఇలియానా కూడా త్వరలోనే డిజిటల్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆమె త్వరలోనే ఓ ఓటీటీ సంస్థ నిర్వహించే టాక్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారట. దక్షిణాదికి చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌ ఆధ్వర ్యంలో ఈ టాక్‌ షోను నిర్వహించనున్నారు. తొలుత ఒక సీజన్‌ను షూట్‌ చేసి 


ప్రేక్షకుల స్పందన చూశాక రెండో సీజన్‌ను ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారు. ఈ టాక్‌ షో చేసినందుకు ఇలియానాకు భారీ పారితోషికం 


ముట్టచెబుతున్నారట. అజయ్‌ దేవ్‌గణ్‌ నటిస్తోన్న తొలి వెబ్‌సిరీస్‌ ‘రుద్ర’లో ఆమె నటిస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటిదాకా 


అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ చిత్రంలో నటిస్తున్నారు.