అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2022-01-28T05:22:51+05:30 IST

: అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అక్రమ కార్యకలపాలను అడ్డుకోవాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ ఆదేశించారు.

అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ వి సత్యనారాయణ

 -  పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ

కరీంనగర్‌ క్రైం, జనవరి 27: అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అక్రమ కార్యకలపాలను అడ్డుకోవాలని  కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ ఆదేశించారు. గురువారం కమిష నరేట్‌లో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ అన్నివర్గాలకు చెందిన ప్రజలతో సత్సబంధాలను కొనసాగిస్తూనే పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేయడం ద్వారా శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. కమిషనరేట్‌లో పోలీసుశాఖ తీసుకునే చర్యలు అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఉండాలన్నారు. ఈ మధ్యకాలంలో అమలు చేస్తున్న వివిధ రకాల చర్యల ద్వారా పరిస్థితులు అదుపులోకి రావడంతోపాటు అన్నివర్గాల ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా రక్షణ,భద్రత చర్యలపై భరోసాను కల్పిస్తున్నాయని చెప్పారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు ప్రాణాల రక్షణ కోసం ప్రాధాన్యతనిస్తూ విధిగా మాస్కులు ధరించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వీయ నియంత్రణ చర్యలు పాటించడం ద్వారానే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు. 


 పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి 


పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని వాటి పరిష్కారం ద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. పెండింగ్‌ కేసుల్లో పరారీలో ఉన్న నిందితు లను గుర్తించేందుకు ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు కమిషనరేట్‌ కేంద్రంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. సైబర్‌ నేరాలను వేగవంతంగా చేధించాలని ఆదేశించారు.  ఆందోళనలు జరిగే సందర్భాలలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూట్యూబ్‌ ఛానెళ్లు, సోషల్‌ మీడియాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ రకాల ప్రసారాలు, పోస్టులు చేసే సమయంలో స్వీయ నియంత్రణ పాటిం చాలని చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-01-28T05:22:51+05:30 IST