అక్రమ మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-08-15T09:28:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం బెల్టుషాపులను పూర్తిగా నిషేదించాం. అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకున్నామని ప్రచారం చేసుకుంటుంది. కాని అక్రమంగా తరలుతున్న మద్యం పలుచోట్ల పట్టుబడుతూనే ఉంది. అందు

అక్రమ మద్యం పట్టివేత

 మద్యం షాపు ఉద్యోగులే కీలకం


ఆత్మకూరు, ఆగస్టు 14 : రాష్ట్ర ప్రభుత్వం బెల్టుషాపులను పూర్తిగా నిషేదించాం. అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకున్నామని ప్రచారం చేసుకుంటుంది. కాని అక్రమంగా తరలుతున్న మద్యం పలుచోట్ల పట్టుబడుతూనే ఉంది. అందులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యంషాపుల్లో పనిచేసే ఉద్యోగులే ఇందులో కీలకపాత్ర పోషిస్తుండడం గమనార్హం. శుక్రవారం ఆత్మకూరులోని నాగులపాడు రోడ్డు వద్ద ఉన్న మద్యంషాపులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు మద్యం బాటిళ్లను షాపు నుంచి గుట్టు చప్పుడుకాకుండా తీసుకెళ్లి విక్రయానికి పాల్పడిన వైనం ఇది.


అయితే ఇందులో ఒక ఉద్యోగిపైనే కేసు నమోదు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం సీబీఐ అధికారుల దృిష్టికి వెళ్లినట్లు సమాచారం. ఎక్సైజ్‌ అధికారుల వివరాలు మేరకు.. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్స్‌పెక్టర్‌ శకుంతలాదేవి ఆత్మకూరులో అంకయ్య పెట్రోల్‌ బంకు సమీపంలో మద్యం బాటిళ్లును అమ్ముతున్న ప్రభుత్వ మద్యం షాపు సేల్స్‌మెన్‌ షేక్‌.సాహిద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ విషయమై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ బాలకృష్ణను వివరణ కోరగా కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-08-15T09:28:33+05:30 IST