అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం: బీఎస్పీ

ABN , First Publish Date - 2022-07-18T04:12:48+05:30 IST

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి కేశవరావ్‌ అన్నారు.

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం: బీఎస్పీ
పోలీస్‌స్టేషన్‌ ముందు నిరసన తెలుపుతున్న బీఎస్పీ నాయకులు

ఉండవల్లి, జూలై 17: అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని  బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి కేశవరావ్‌ అన్నారు. అలంపూర్‌ కస్తూర్బా పాఠశాలలో ఉండవల్లి మండ లం పుల్లూరు గ్రామానికి చెందిన సురేఖ (ఏడవ తరగతి)అనే విద్యార్థి ప్రమా దవశాత్తు మరణించింది. ఆదివారం ఉదయం బాధిత కుటుంబానికి సంఘీభావం తెలపడానికి పుల్లూరు గ్రామానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసి ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారన్నారు.  సాయంత్రం వరకు వారిని విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి కేశవరావ్‌ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ ముందు  నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఇంచార్జి కేశవరావ్‌ మాట్లాడుతూ మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి శాంతియుతంగా వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం, ఇటీవల  బాసర ట్రిపుల్‌ ఐటీలో జరిగిన ఘటన ఉదాహరణ అని అన్నారు. ఇలాంటి ఘటనలను ఎప్పటికప్పుడు  ప్రశ్నిస్తున్న బీఎస్పీ నాయకుల గొంతునొక్కే పనిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పోలీస్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయించడం మంచిది కాదని హితవు పలికారు. బీఎస్పీ నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేశామని సాయంత్రం  సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఏఎస్సై అయ్యన్న తెలిపారు. అరెస్ట్‌ అయిన వారిలో బీఎస్పీ అలంపూర్‌ అధ్యక్షుడు మహేష్‌, ఉపాధ్యక్షుడు యామిని సుంకన్న, సెక్రటరీ రవిచంద్ర, ఉండవల్లి మండల కన్వీనర్‌ ప్రభుదాస్‌, శివశంకర్‌, పుల్లూరు మద్దిలేటి, రవీందర్‌, రవి, తదితరులున్నారు. 

కేజీబీవీ వద్ద పోలీసు బందోబస్తు 

అలంపూరు : అలంపూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద అలంపూరు  ఎస్‌ఐ శ్రీహరి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 14న కేజీబీవీ పాఠ శాలలో ఏడవ తరగతి విద్యార్థిని స్నానాల గదిలో కాలుజారి పడిందని ఎస్‌వో కృష్ణ వేణి తెలిపారు.  వెంటనే పాఠశాల ఉపాధ్యాయురాలు అలంపూరు ప్రభుత్వ ఆస్ప త్రికి, అక్కడ నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   చికిత్స పొందు తూ విద్యార్థిని మృతి చెందింది. దాంతో ఎలాంటి అవాంచనీయ  సంఘటనలు జ రగకుండా కేజీబీవీ వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Updated Date - 2022-07-18T04:12:48+05:30 IST