అర్ధరాత్రి తవ్వకం.. దొడ్డిదారిన అమ్మకం

ABN , First Publish Date - 2021-02-21T05:04:39+05:30 IST

ఊరంతా పడుకున్నాక అక్కడ యంత్రాలు మేల్కొంటాయి. చెవులు హోరెత్తించేలా శబ్దాలు మొదల వుతాయి. ట్రాక్టర్లు రయిన దూసుకెళ్తాయి. ఎక్స్‌కవేటర్లు పెద్దపెద్ద రాళ్లను వెలికి తీస్తాయి. భూమిని తవ్వడం, రాళ్లను వెలికితీయడం, ట్రాక్టర్లల్లోకి ఎక్కించడం, రవాణా చేయడం చకచకా జరిగిపోతాయి. ఇదీ నగరానికి కూతవేటు దూరంలో మూడో కంటికి తెలియకుండా జరుగుతున్న బైరటీస్‌ దందా!

అర్ధరాత్రి తవ్వకం.. దొడ్డిదారిన అమ్మకం
రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన బైరటీస్‌

నగరంలో బైరటీస్‌ మాఫియా దందా

పట్టా భూముల్లో రాత్రిపూట తవ్వకాలు

అధికారులు దాడులు చేస్తున్నా భయపడని తీరు

లబోదిబోమంటున్న పట్టాభూమి యజమానులు

ఖానాపురంహవేలి, ఫిబ్రవరి20: ఊరంతా పడుకున్నాక అక్కడ యంత్రాలు మేల్కొంటాయి. చెవులు హోరెత్తించేలా శబ్దాలు మొదల వుతాయి. ట్రాక్టర్లు రయిన దూసుకెళ్తాయి. ఎక్స్‌కవేటర్లు పెద్దపెద్ద రాళ్లను వెలికి తీస్తాయి. భూమిని తవ్వడం, రాళ్లను వెలికితీయడం, ట్రాక్టర్లల్లోకి ఎక్కించడం, రవాణా చేయడం చకచకా జరిగిపోతాయి. ఇదీ నగరానికి కూతవేటు దూరంలో మూడో కంటికి తెలియకుండా జరుగుతున్న బైరటీస్‌ దందా!

వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబరు 156లోని వాసిరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తికి పది ఎకరాల భూమి ఉంది. ఈప్రాంతంలో బైరటీస్‌ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. వీటికి బహిరంగ మార్కెట్‌లో ధర బాగుండటంతో అక్రమార్కులు గతంలోనే ఆ సర్వే నంబరు పరిసర ప్రాంతాల్లో ఖనిజాన్ని ఖతం చేసి రూ. కోట్లకు ఎదిగారు. ఆ ప్రాంతంలో ఖనిజం నిండుకోవడంతో వాసిరెడ్డి శ్రీనివాసరావు భూమిపై పడ్డారు. అతడి అనుమతి లేకుండానే పెద్దపెద్దయంత్రాలను తీసుకొచ్చి అర్థరాత్రి పూట బైరటీస్‌ను వెలికి తీసి దర్జాగా అమ్ముకుంటున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు బైరటీస్‌ను వెలికి తీస్తున్న ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈవిషయమై సంబంధిత పోలీసుస్టేషన్‌లో శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. 

గతంలో ఇదే ప్రాంతంలో అక్రమ బైరటీస్‌ తవ్వకాలు

వెలుగుమట్లరెవెన్యూ పరిధిలోని సర్వేనెంబరు 155లో గతనెల జనవరి లో 150మె.టన్నుల బైరటీ్‌సను మైనింగ్‌, రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. దీనికి సంబంధించి జనవరి 28న 150 మె.టన్నుల బైరటీ్‌సన బహిరంగ వేలం వేశారు. ఈవేలంలో రూ.6.76 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మైనింగ్‌ అధికారులు తరుచూ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికి మాఫియా బైరటీ్‌సను తరలిస్తునే ఉండడం విశేషం. అధికారులు ఎటు వెళుతున్నారు ఎటు వస్తున్నారనే సమాచారం కోసం కొంతమంది వ్యక్తులనుఏర్పాటుచేసుకుని ఎవ్వరు లేరు అని నిర్ధారించుకున్నాక బైరటీ్‌సను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేసిన బైరటీస్‌ ప్రాంతాన్ని ఆనుకునే అర్థరాత్రి అక్రమ తవ్వకాలు జరుపుతున్నారంటే వారికి ఎంత నెట్‌వర్క్‌ ఉందో ఇట్టే అర్థమవుతుంది ప్రస్తు తం సీజ్‌ చేసిన బైరటీస్‌ సుమారు 40నుంచి50టన్నుల వరకు ఉంటుం ది. దీని విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుంది. మూడు, నాలుగురోజుల క్రితం ఇదే ప్రాంతం నుంచి 4నుంచి5 ట్రాక్టర్ల ద్వారా అర్థరాత్రి  బైరటీ్‌సను తరలించారు.. దీని విలువ సుమారు 2లక్షల వరకు ఉంటుందనే సమాచారం బైరటీస్‌ వ్యాపారం చేసేవారిపై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై సర్కారు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. 

Read more