అక్రమ కేసులు ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2021-06-21T04:40:21+05:30 IST

సీపీఐ జిల్లా కార్యదర్శి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ విజయరాములుపై పెట్టిన అక్ర మ కేసులు ఎత్తివేయాలని సీపీఐ నాయకులు డిమాం డ్‌ చేశారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలి
రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

- పట్టణంలోని పాతబస్టాండ్‌ లో సీపీఐ నాయకులు రాస్తారోకో 

అమరచింత, జూన్‌ 20: సీపీఐ జిల్లా కార్యదర్శి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ విజయరాములుపై పెట్టిన అక్ర మ కేసులు ఎత్తివేయాలని సీపీఐ నాయకులు డిమాం డ్‌ చేశారు.   ఆదివారం పట్టణ పాతబస్టాండ్‌ లో రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవకతవకలను ఎత్తి చూపుతున్నందుకు విజయరా ములుపై కాంట్రాక్టర్‌ శ్రీనివాసులు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టారన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించడమే తప్పా అని ప్రశ్నించారు. పోలీసులు కూడా వత్తాసు పలుకడం శోచనీయమన్నారు. కాం ట్రా క్టర్‌ కేసును ఉపసంహరించుకోవాలని సీపీఐ నా యకులు అబ్రహాం, రాబర్టు, మోషే, భాస్కర్‌  డిమాం డ్‌ చేశారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి అయూబ్‌ఖాన్‌, టీ డీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేష్‌ కేసును వి చారణ చేయాలని ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను కోరారు.

అక్కసుతోనే కేసులు

వనపర్తి టౌన్‌: సీపీఐ జిల్లా కార్యదర్శి, అమరచింత మునిసిపల్‌ కౌన్సిలర్‌ విజయరాములుపై పెట్టిన అక్ర మ కేసును తక్షణమే ఎత్తివేయాలని సీపీఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్‌ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న వారి బాగోతాలు బయటికి తీ స్తున్నాడనే అక్కసుతో ప్రజానాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఫ్రెండ్లీ పో లీసు వ్యవస్థకు అమరచింతలో తూట్లు పడుతున్నా యని, అక్కడి ఎస్‌ఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రని తెలిపారు.  విజయరాములుపై పెట్టిన అక్రమ కేసును బేషరతుగా ఉపసంహరించుకోకుంటే ప్రజాక్షే త్రంలో పోరాటాలు  చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-06-21T04:40:21+05:30 IST