అక్రమ కేసులు ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2020-09-21T06:23:54+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లపై నిరసన కార్యక్రమాలు చేసినందునే ఢిల్లీ మతకల్లోలాలు

అక్రమ కేసులు ఎత్తివేయాలి

కొత్తగూడెం సంక్షేమం, సెప్టెంబరు 20: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ  పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లపై నిరసన కార్యక్రమాలు చేసినందునే ఢిల్లీ మతకల్లోలాలు జరిగాయని అందుకు కారకులంటూ సీతారాం ఏచూరి, జయతి ఘోష్‌, యోగేంద్ర యాదవ్‌ తదితరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆవాజ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ నబీ డిమాండ్‌ చేశారు.


ఆదివారం ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, విద్యావంతుల సంయుక్త సమావేశం ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో అబ్దుల్‌ నబీ మాట్లాడుతూ... వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు షేక్‌ అబ్దు ర్రహీం, ముహమ్మద్‌ జలాల్‌, అలీ, షేక్‌ పాషా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాటోతు కృష్ణ, సీఐటీయు నాయకులు కొండపల్లి శ్రీధర్‌, భూక్యా రమేష్‌, ఎన్‌ఎ్‌స. రాజు, యుటీఎఫ్‌ నాయకులు ఎస్‌. వెంకటేశ్వర్లు, ఎన్‌. కృష్ణ, డీవైఎ్‌ఫఐ నాయకులు సుధీర్‌, ఐద్వా నాయకురాలు జయ శ్రీ, యు. నాగేశ్వరరావు, ఎన్‌. శివ, జానీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T06:23:54+05:30 IST