ఔటర్‌ పక్కనే అక్రమ నిర్మాణాలు

ABN , First Publish Date - 2020-08-03T16:19:15+05:30 IST

శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ పక్కన అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. బుఽధవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ బఫర్‌ జోన్‌లో తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఔటర్‌ పక్కనే అక్రమ నిర్మాణాలు

బఫర్‌ జోన్‌ నిబంధనలకు తూట్లు

భారీగా హోర్డింగ్స్‌ ఏర్పాటు


శంషాబాద్‌ రూరల్‌(ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ పక్కన అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. బుఽధవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ బఫర్‌ జోన్‌లో తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదివరకే శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని కొందరు అక్రమార్కులు  నిబంధనలకు విరుద్ధంగా ఔటర్‌ రిండ్‌ రోడ్డుకు ఆనుకుని ఆరు, ఏడు అంతస్థుల భవనాలు నిర్మించారు. ఎయిర్‌పోర్టు కాలనీ నుంచి తొండుపల్లి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు గత పాలకుల అండదండలతో  అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తాజా ఆదేశాలతో ఓఆర్‌ఆర్‌ ఇరువైపులా నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలను తొలగించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేయాలని ప్రైవేట్‌  భూయజమానులు, ఓఆర్‌ఆర్‌ వెంట కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. బఫర్‌ జోన్‌ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు తప్పనిసరి 15 మీటర్ల సెట్‌ బ్యాక్‌  నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, డెవలపర్స్‌ ప్రభుత్వ స్థానిక సంస్థలు మున్సిపల్‌, గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా పాటించాలని అదేశించారు.  అయితే గతనెల 30న శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులు కొరడా ఝలిపించారు. కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వెళ్లే ట్రంపెట్‌ రోడ్డుకు ఇరువైపులా అక్రమార్కులు వందలాది హోర్డింగ్స్‌ అక్రమంగా చేపట్టారు. అదేవిధంగా తొండుపల్లి శ్మశానవాటికలో హోర్డింగ్‌ ఏర్పాటుచేశారు. అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. 

Updated Date - 2020-08-03T16:19:15+05:30 IST