చెరువు స్థలంలో అక్రమ దందా

ABN , First Publish Date - 2021-06-21T06:29:37+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెరు వు భూములు కబ్జాకు గురవుతున్నాయి.

చెరువు స్థలంలో అక్రమ దందా
చదును చేసిన శిఖం స్థలం

బఫర్‌ జోన్‌ను వదలని రియల్‌ కేటుగాళ్లు

లే అవుట్‌ లేకుండా అనధికార అనుమతులు

మధ్యవర్తిత్వం కోసం రంగంలోకి ఓ నేత

అనుమతులకు రూ. లక్షలో డిమాండ్‌

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

జగిత్యాల, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెరు వు భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రధానంగా చెరువు శిఖం, బఫ ర్‌ జోన్‌ భూములపై రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులు, చోటా మోటా నేతలు కన్నేసి ఆక్రమణలు చేపడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మోతే రోడ్డుకు సమీపంలోని ఓ చెరువుకు చెందిన బఫర్‌ జోన్‌ భూమిని కబ్జా చేయడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మా రుతున్నాయి. జగిత్యాల బల్దియాకు అవినీతి మకిలి అంటినా, ఏసీబీ దా డులు జరిగినప్పటికీ కొందరు రాజకీయ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల తీరు మారడం లేదు. మ్యుటేషన్‌ అక్రమాల విషయంలో కొందరు కౌన్సిల ర్ల పాత్ర ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటిదే జగిత్యాల ప ట్టణంలోని ఓ భూమి అనుమతుల విషయంలో ఓ రాజకీయ నేత వ్యవ హరిస్తున్న తీరు చర్చనీయంశంగా మారింది. మున్సిపాల్టీల్లో చెరువు కట్ట ను ఆనుకొని ఉన్న 30 ఫీట్ల భూమిని బఫర్‌ జోన్‌గా గుర్తిస్తారు. సంబం దిత భూమి జలవనరుల శాఖ పర్యవేక్షణలో ఉండాల్సి ఉంది. సదరు భూమిలో ఎటువంటి నిర్మాణాలు, క్రయ విక్రయాలు జరపడానికి వీలు లేదు. కాగా ఇటీవల జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్‌లో గల చెరువు కట్టను ఆనుకొని సుమారు 29 గుంటల స్థలాన్ని కొందరు ప్లాట్‌గా పెట్టి విక్రయానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ప్రాంతంలో గుంట భూమికి రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పలుకు తోంది. దీంతో సంబంధిత స్థలంపై అక్రమార్కులు కన్నేశారు. అయితే ఈ భూమికి సంబంధించి లే అవుట్‌ అనుమతులు లేకపోవడం, చెరువు శి ఖానికి చెందిన బఫర్‌ జోన్‌ వదిలేయకుండా ప్లాట్స్‌ పెట్టడం తెలుసుకు న్న ఓ రాజకీయ పార్టీ నేత భూమి అనుమతులు విషయంలో అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చి మద్య వర్తిత్వం వహించినట్లు తె లుస్తోంది. దీనికి గాను ఏకంగా రూ. 15 నుంచి రూ. 20 లక్షలు డి మాండ్‌ చేసినట్లు పార్టీలోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఈ చర్చ రోజురోజుకు ముదరడంతో ఈ ఆంశం రియల్‌ రంగంలో చర్చనీ యాంశంగా మారింది. 

లొసుగులను ఆసరగా చేసుకుంటూ....

మోతె చెరువు బఫర్‌ జోన్‌ స్థలాన్ని ఆనుకొని వెంచర్‌ ఏర్పాటు చేస్తు న్న సదరు వ్యాపారి లొసుగులను ఆసరాగా చేసుకొని చాకచక్యంగా వ్యవ హరిస్తూ అధికారులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆ రోపణలున్నాయి. ఓ పర్యాయం చెరువు బఫర్‌ జోన్‌కు సంబంధించిన స్థ లాన్ని కలుపుకొని లే అవుట్‌ మ్యాప్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. బ ఫర్‌జోన్‌ స్థలం ఆక్రమణకు గురవుతుందన్న సమాచారం బయటకు పొ క్కి ప్రచారం కావడంతో లే అవుట్‌ను మరో విధంగా మార్చినట్లు రియల్‌ ఏస్టేట్‌ వర్గాలు అంటున్నాయి. బఫర్‌ జోన్‌ స్థలాన్ని లే అవుట్‌ మ్యాప్‌లో మున్సిపల్‌ రహదారిగా గుర్తిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం చెరువు కట్టను ఆనుకొని 30 ఫిట్లదూరం వరకు ఉన్న బఫర్‌ జోన్‌ స్థలాన్ని వదిలిపెట్టి ప్రైవేటు పట్టా స్థలం నుంచి రహ దారులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటున్నప్పటికీ అలా వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి.

నిబంధనలు గాలికి....

జగిత్యాల మున్సిపల్‌ పరిఽధిలో ఉన్న ఈ భూమి చెరువు కట్టను ఆను కొని అతి సమీపంలో ఉంది. అయితే చెరువు శిఖంకు బఫర్‌ జోన్‌ పరిధి నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈ భూమిలో ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఈ భూమికి సంబంఽధించిన లే అవుట్‌ అనుమతులు లేకపోవడంతో సద రు ప్రజా ప్రతినిధి రంగంలోకి దిగినట్లు సమాచారం. గతంలో ఓ పర్యా యం ఇదే భూమిలో అక్రమ ప్లాట్లు ఏర్పాటు చేశారని హద్దు రాళ్లను తొలగించిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్రస్తుతం పట్టించు కోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జగిత్యాల మున్సిపల్‌ టౌన్‌ ప్లా నింగ్‌ విభాగం అవినీతికి నిలయంగా మారడంతో ఇటీవలే ఫిబ్రవరి తొ మ్మిదవ తేదిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై ఏసీబీ అధికా రులు దాడులు నిర్వహించి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన జ రిగి నాలుగు నెలలు గడవక ముందే ప్రస్తుతం జరుగుతున్న మరో అక్ర మ, అవినీతి ఘటన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు తంటాలు తెచ్చిపెట్టే విధంగా తయారయిందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. 

పట్టించుకోని జలవనరుల శాఖ అధికారులు.....

చెరువులు, కుంటలు, కెనాల్స్‌ భూములను పరిరక్షించాల్సిన జలవన రుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు ఇష్టా రాజ్యంగా భూములు కబ్జాలు చేస్తున్న నాలాలు, జఫర్‌ జోన్‌ల మీద నిర్మాణాలు చే స్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, జలవనరుల శాఖ అ ధికారులు స్పందించి విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-06-21T06:29:37+05:30 IST