అక్రమ లే అవుట్లను గుర్తించాలి

ABN , First Publish Date - 2020-09-24T06:57:32+05:30 IST

గ్రామీణ, పట్టణ స్థాయిలో అక్రమ లే అవుట్లను గుర్తించి 100 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ సాధించేలా కృషి చేయాలని రాష్ట్ర

అక్రమ లే అవుట్లను గుర్తించాలి

 రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌ 


మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 23 : గ్రామీణ, పట్టణ స్థాయిలో అక్రమ లే అవుట్లను గుర్తించి 100 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ సాధించేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎంఆర్‌, పల్లె ప్రకృతి వనాలు, ఎల్‌ఆర్‌ఎస్‌, స్ట్రీట్‌ వెండర్స్‌ రుణాలు, రైతువేదికలు, పట్టణ ప్రగతిలో నర్సరీలు, అర్బన్‌ ట్రి పార్కులు తదితర కార్యక్రమాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ సత్యనారాయణలు పాల్గొన్నారు. సీఎంఆర్‌ (కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌) ప్రతీ రోజు రైస్‌ నిల్వల నుంచి ఎఫ్‌సీఐకు పంపిస్తున్నధాన్యం వివరాలు, బ్యాలెన్స్‌ వివరాలను తెలపాలని, సీఎంఆర్‌ లక్ష్యాలను వారం రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు.


రైతువేదికల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, పేమెంట్లను వెంట వెంటనే చెల్లించాలని సూచించారు. కలెక్టర్‌ భారతి హొళికేరి మాట్లాడుతూ సీఎంఆర్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, పల్లె ప్రకృతివనం, వీధి వ్యాపారుల రుణాలు, పట్టణ, పల్లె ప్రగతి నర్సరీలు, టీ పార్కుల నిర్మాణాలను పూర్తి చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి  ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్‌డీఏ పీడీ శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ,  మున్సిపల్‌ కమిషనర్‌లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T06:57:32+05:30 IST