అక్రమ మద్యం విక్రయదారుడు అరెస్టు
ABN , First Publish Date - 2022-01-27T04:37:38+05:30 IST
అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతుండగా పో లీసులు దాడిచేసి నిందితున్ని అదుపులో కి తీసుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కడప(క్రైం), జనవరి 26: అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతుండగా పో లీసులు దాడిచేసి నిందితున్ని అదుపులో కి తీసుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కడప తాలూక పోలీ్‌సస్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై కడప డీ ఎస్పీ వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో తా లూక సీఐ నాగభూషణం దాడులు నిర్వహించారు.
కడప నగరం అంబాభవానీ గుడికి దక్షిణాన బుగ్గవంక బ్రిడ్జి కింద అక్రమంగా మద్యం అమ్ముతూ అదే ప్రాంతాని కి చెందిన సందా తిరుపాల్ అరెస్ట్ అయ్యాడు. కడపలోని వివిధ మద్యం షాపుల నుంచి కొని తన ఇంటి వద్ద ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింద న్నారు. రూ. 25000 విలువైన 112 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దాడు ల్లో ఎస్‌ఐ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ మద్యం పట్టివేత
వల్లూరు, జనవరి 26: వల్లూరులో అక్రమ మద్యం అమ్ముతున్న ఒకరిని అరెస్టు చేసి11 మద్యం బాటిళ్లను స్వాధీన పరుచుకున్నట్లు ఎస్‌ఐ విష్ణువర్థన్ తెలిపారు. అందిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.