Abn logo
Oct 29 2020 @ 20:24PM

పరుపులో మద్యం.. ఏపీలో జోరుగా అక్రమ రవాణా

విజయవాడ: ఏపీలో మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మందుబాబులు రోజుకో ఐడియాతో బాటిల్స్‌ను సరిహద్దుల్ని దాటిస్తున్నారు. కానీ తనిఖీలు ముమ్మరంగా చేస్తుండటంతో ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏకంగా పరుపులో మద్యాన్ని పెట్టి తరలిస్తుండగా దొరికిపోయారు. టాటాస్ ఏస్ వాహనంలో తెనాలికి తరలిస్తున్న 604 మద్యం బాటిల్స్‌ను పోలీసులు పట్టుకున్నారు.టాటాఎస్ వాహనంతో పాటు మద్యాన్ని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement