చింతూరులో అక్రమ మైనింగ్‌ తవ్వకాలు ఆపాలి

ABN , First Publish Date - 2020-02-23T06:41:44+05:30 IST

చింతూరు మండలం కస్సులూరు గ్రామంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌ తవ్వకాలను

చింతూరులో అక్రమ మైనింగ్‌ తవ్వకాలు ఆపాలి

అటవీ సంరక్షణాధికారికి సీపీఎం నాయకుల వినతి 


రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 22: చింతూరు మండలం కస్సులూరు గ్రామంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం నేతలు  డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సున్నం రాజయ్య, జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కుంజా సీతారామయ్య రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ అటవీ సంరక్షణాధికారి నాగేశ్వరరావుకు శనివారం వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చింతూరు మండలంలో షెడ్యూల్డు ప్రాంతంగా ఉన్న అటవీ ప్రాంతంలో అక్రమం గా మైనింగ్‌ తరలించుకుపోతున్నారన్నారు.


బాంబింగ్‌ చేస్తుంటే ఆ ప్రాంతంలోని రెవెన్యూ, ఐటీడీఏ, పోలీస్‌శాఖలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని, ఇది సరికాదని అన్నారు. తక్షణమే అటవీశాఖ జోక్యం చేసుకుని ఈ అక్రమ మైనింగ్‌ నిలుపుదల చేయాలని డిమా ండ్‌ చేశారు. కాగా, సీసీఎఫ్‌వో నాగేశ్వరరావు తమ విషయాలన్నీ పరిశీలిస్తామని, తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సీపీఎం నాయకులు చెప్పారు. అదేవిధంగా తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలని డిమాండ్‌ చేశా రు. తునికాకు సేకరణ ద్వారా వచ్చిన డబ్బులు గిరిజనులకు ఖరీఫ్‌లో పంట పెట్టుబడిగా ఉప యోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సేకరణకు టెండర్లు పిలిచిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా టెండర్లు పిలవలేదని వాపోయారు. సీజన్‌ పూర్తవుతోందని వెంటనే టెండర్లు పిలవాలని వారు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-02-23T06:41:44+05:30 IST