అక్రమంగా చెరువు మట్టి తోడేస్తున్నారు..

ABN , First Publish Date - 2021-05-10T05:55:52+05:30 IST

మండలంలోని రాయలచెరువు గ్రామంలోని చెరువుమట్టి తరలింపునకు ఎటువంటి అనుమతులు లేకపోయి నా అక్రమ వ్యాపారానికి తెరలేపారు.

అక్రమంగా చెరువు మట్టి తోడేస్తున్నారు..
చెరువు మట్టిని లోడింగ్‌ చేస్తున్న దృశ్యం

టిప్పర్‌ లోడింగ్‌కు రూ.800 - రోజూ కనీసం వంద టిప్పర్ల మట్టి తరలింపు


యాడికి, మే 9: మండలంలోని రాయలచెరువు గ్రామంలోని చెరువుమట్టి తరలింపునకు ఎటువంటి అనుమతులు లేకపోయి నా అక్రమ వ్యాపారానికి తెరలేపారు. కొందరు వైసీపీ నాయకు లు బరితెగించి అక్రమార్జనకు పూనుకున్నారన్న ఆరోపణలున్నా యి. చెరువులో మట్టిని లోడింగ్‌ చేయడానికి హిటాచీ యం త్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక టిప్పర్‌ లోడింగ్‌కు రూ.800 వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీన్నిబట్టిచూస్తే ఒక్కో నాయకుడి జేబులోకి రోజుకు వేల రూపాయల సొమ్ము అక్రమంగా పోగవుతోంది. మ ట్టి తరలింపులో మండలంలోని రాయలచెరువు, పెద్దవడుగూరు మండలంలోని కదరగుట్టపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నా యకులు కలిసి మొత్తం ఐదుగురు భాగస్వామ్యంతో చెరువు మ ట్టి కొల్లగొట్టే వ్యాపారం మొదలుపెట్టినట్లు మండలవ్యాప్తంగా చ ర్చ కొనసాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషనశాఖ అనుమతులు ఉండి, టిప్పర్‌ మట్టి లోడింగ్‌కు రూ.400 వసూ లు చేసినందుకు టీడీపీ నాయకులపై దుమ్మెత్తిపోసిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు చేస్తున్న పని ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.


గతంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చొరవ తీసుకొని చెరువు మట్టి లోడింగ్‌ ఉచితంగా ఏర్పాటు చేయించారని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇప్పుడు యంత్ర సామర్థ్యం పెరిగినందువల్ల లోడింగ్‌కు ఇంకా తక్కువ ఖర్చు అవుతుందని, కానీ వైసీపీ నాయకులు గతంలో కంటే రెట్టింపు ధరకు లోడింగ్‌ పెట్టడం దారుణమని పలువురు రైతులు తెలిపారు. ఒక్కరోజు కు 80 నుంచి 100కు పైగా టిప్పర్ల మట్టిని తరలిస్తుండడం గ మనార్హం. సామాన్య రైతులు మట్టి తోలుకోవాలంటే సాధ్యం కాని పని అని, ఇరిగేషనశాఖ అధికారులు తగు చొరవచూపి రై తులు ఎవరైనా సరే చెరువులో మట్టి లోడింగ్‌ యంత్రాలు ఏర్పాటుచేసుకొనేలా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. లేదా గ తంలో మాదిరిగా ఉచిత లోడింగ్‌ ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇ ప్పుడు ఏర్పాటుచేసిన మట్టి తరలింపు వైసీపీ నాయకుల జేబు లు నింపుకోవడానికే అనే విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నా యి. సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి న్యాయం జ రిగేలా చేయాలని రైతులు కోరుతున్నారు.


గతంలో మట్టి తరలింపును అడ్డుకున్న అధికారులు

 రెండేళ్లక్రితం రాయలచెరువులోని చెరువు మట్టి తరలింపు వి షయంలో వైసీపీలోని రెండు వర్గాలు గొడవపడడంతో మట్టి తరలింపును అప్పట్లో అధికారులు అడ్డుకున్నారు. ఇప్పుడు రైతుల నో ట్లో మట్టి కొట్టేలా ఉన్నా మట్టి తరలింపును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని స్థానిక రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


అనుమతులు తీసుకోమని తెలియజేశాం

 జీవన, ఇరిగేషనశాఖ జేఈ

చెరువుమట్టి అక్రమ తరలింపుపై ఇరిగేషన శాఖ జేఈ జీవనతో ఫోనలో సంప్రదించగా... మట్టి తరలింపు విషయం మా దృష్టికి వచ్చింది మట్టి తరలింపును ఆపేయాలని చెప్పాం. మా సిబ్బందిని అక్కడకు పంపించాం. మట్టి తరలింపు నిలుపుదల చే శారు. దీనికి సంబంధించిన అనుమతులు సోమవారం వచ్చి తీ సుకోవాలని తెలియజేశామని తెలిపారు.


ఆదేశాలు బేఖాతర్‌

మట్టి తరలింపును ఆపేయాలని అధికారులు హెచ్చరించినా శనివారం కూడా యథేచ్ఛగా మట్టి తరలిస్తుండడం గమనార్హం. ఇరిగేషన సిబ్బంది చెరువు వద్దకు వెళ్లినపుడు మాత్రం లోడింగ్‌ పనులు ఆపేయడం, వారు వెళ్లిన తర్వాత లోడింగ్‌ పనులు కొనసాగడం గమనార్హం.

Updated Date - 2021-05-10T05:55:52+05:30 IST