పొగాకు అక్రమ కొనుగోళ్లను నిరోధించాలి

ABN , First Publish Date - 2021-04-11T05:19:36+05:30 IST

పొగాకు అక్రమ కొ నుగోళ్లు నిరోధించేందుకు బోర్డు అధికారులు చ ర్యలు చేపట్టాలని, ఇండెంట్లు తీసుకున్న బ య్యర్లు వేలంలో పాల్గొనేలా చేయాలని పొగాకు రైతు సంఘం నాయకుడు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలు గు సంవత్సరాలుగా పొగాకు రైతులు నష్టాలబా ట పట్టారని తెలిపారు.

పొగాకు అక్రమ కొనుగోళ్లను నిరోధించాలి
సమావేశంలో పాల్గొన్న నాయకులు

మద్దిపాడు, ఏప్రిల్‌ 10 : పొగాకు అక్రమ కొ నుగోళ్లు నిరోధించేందుకు బోర్డు అధికారులు చ ర్యలు చేపట్టాలని, ఇండెంట్లు తీసుకున్న బ య్యర్లు వేలంలో పాల్గొనేలా చేయాలని పొగాకు రైతు సంఘం నాయకుడు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలు గు సంవత్సరాలుగా పొగాకు రైతులు నష్టాలబా ట పట్టారని తెలిపారు. గత సంవత్సరం సీఎం జగన్‌మోహనరెడ్డి చొరవతో మార్కెఫెడ్‌రంగం లోకి దిగడం వల్ల రైతుల నష్టం కొంతమేర త గ్గిందని చెప్పారు. ఒంగోలు-2 వేలంకేంద్రం రై తు నాయకుడు వడ్డెళ్ల ప్రసాద్‌ మాట్లాడుతూ  బయ్యర్లు వేలంలో పాల్గొనకపోవడంతో పొగాకు ధరలు రోజురోజుకు దిగజారుతున్నాయని చె ప్పారు. నాణ్యమైన పొగాకు కూడా వ్యాపారులు ఆర్డర్లు లేవని కుంటిసాకు చెబుతున్నారని విమ ర్శించారు. వెల్లంపల్లి రైతు సంఘం  అధ్యక్షుడు అబ్బూరి శేషగిరావు మాట్లాడుతూ వేలంలో తీ రులో మార్పులు రాకుంటే రైతు సంఘాలు ఐ క్యంగా ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో రావి ఉమామహేశ్వరరావు, మండవ గోవిందరా జులు, బోయపాటి వెంకయ్య, తదితరులు పా ల్గొన్నారు. కాగా జీపీఐ బయ్యర్‌ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు వెల్లంపల్లి అక్షన్‌ సూపరిం టెండెంట్‌ ఉమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా ని ర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌డీవో సురేంద్ర కుమార్‌, ఐటీసీ బయ్యర్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T05:19:36+05:30 IST