అక్రమ బదిలీలు ఆపాలి

ABN , First Publish Date - 2020-02-23T06:01:34+05:30 IST

జిల్లాలో గ్రేడ్‌-2 హెచ్‌ఎంల బదిలీల్లో భాగంగా రెండు అక్రమ బదిలీలను వెంటనే ఆపాలని యూటీఎఫ్‌ జిల్లా

అక్రమ బదిలీలు ఆపాలి

నెల్లూరు (విద్య) ఫిబ్రవరి 22 :జిల్లాలో గ్రేడ్‌-2 హెచ్‌ఎంల బదిలీల్లో భాగంగా రెండు అక్రమ బదిలీలను వెంటనే ఆపాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.నవకోటేశ్వరరావు, కె.తులసీరాంబాబు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లాలో మొత్తం 15 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉండగా రాజకీయ ఒత్తిళ్లతో ముసునూరు, ఆర్‌సీపాళెం జడ్పీ పాఠశాలల పోస్టులు భర్తీ చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలపై నిషేధం ఉండగా అర్హులైన వారిని పక్కనపెట్టి ఖాళీల్లో ఒకటైన ముసునూరు జడ్పీ పాఠశాల ఉద్యోగోన్నతి దొడ్డిదారిన చేపట్టారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ బదిలీలను వెంటనే ఆపాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. 

Updated Date - 2020-02-23T06:01:34+05:30 IST