ధరా.. భారం

ABN , First Publish Date - 2021-10-14T06:14:07+05:30 IST

నిత్యావసరాలు కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ధరా.. భారం

వ్యాపారుల దోపిడీ 

నాణ్యత అంతంతమాత్రమే

కొరవడిన అధికారుల నిఘా

నేడు జాతీయ వస్తు నాణ్యతా ప్రమాణ దినోత్సవం

గుంటూరు(తూర్పు), అక్టోబరు 13: నిత్యావసరాలు కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తూకంలో, ధరల్లో, నాణ్యతలో ఇలా అన్ని విధాలుగా వినియోగదారుడు మోసపోతున్నాడు. నిత్యావసరాలు, ఇతర వస్తువులు విక్రయ దుకాణాల్లో ఎక్కడా వస్తు నాణ్యతా ప్రమాణాలు, ధరల విషయంలో ప్రభుత్వ నియమాలు పాటించడం లేదు. దుకాణాల్లో ధరల పట్టికను ఏర్పాటు మరిచారు. ఇటువంటి వాటిపై తనిఖీలు నిర్వహించాల్సిన  అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిఘూ దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. కొవిడ్‌ను అడ్డుపెట్టుకుని వ్యాపారులు వస్తువులను రెట్టింపు ధరలకు అమ్మారు. తూనికల, కొలతల శాఖ చట్ట ప్రకారం ఎలాకా్ట్రనిక్‌ కాటా, కాటా రాళ్లపై ప్రభుత్వ ముద్రలు తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలామంది వ్యాపారులు తమ కాటాలకు ప్రమాణాలు పాటించడం లేదు. అంతకముందు ప్రభుత్వమే ఈ ముద్రలు వేస్తున్నప్పుటికీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ పనిని కేంద్రం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. కానీ ఈ విషయంలో ఆ ఏజెన్సీలు అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయి. అసలు జిల్లాలో వీటి కార్యాలయం ఎక్కడ ఉందో కూడా చాలామంది వ్యాపారులకు తెలియదు.  

ఇష్టారాజ్యంగా ఎలకా్ట్రనిక్‌ విడి భాగాల ధరలు

కరోనా తర్వాత కంప్యూటర్‌, మొబైల్‌ పరికరాలు వినియోగం పెరిగింది. దీంతో వీటి విడిభాగాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అమ్మకాలపై నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు నాసిరకం వస్తువులను అంటగడుతున్నారు. వాటి బ్యాచనెంబర్లు, కస్టమర్‌ కేర్‌ ఫోను నెంబర్లను ముద్రించకుండానే విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారుడు నష్టపోతున్నాడు. సెల్‌ఫోను డిస్‌ప్లే, స్ర్కీన గార్డులు, ఇయర్‌ ఫోనులు, ఫ్లిప్‌ కవర్లు వంటి విషయాల్లో వినియోగదారుడు ఎక్కువుగా మోసపోతున్నాడు. కిరాణా దుకాణాల్లో ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయించడం, నికర బరువు కన్నా తక్కువుగా తూకం వేయడం, బేకరీల్లో కేకులను మొత్తం బరువును అమ్మకుండా కింద ఉండే అట్టతో కలిపి తూకం వేస్తుంటారు. దీంతో కేజీకి 200 గ్రాముల వరకు నష్టపోతుంటాం. ప్యాకింగ్‌ చేసిన వస్తువులపై పూర్తి వివరాలు ఉండటం లేదు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

ప్యాకేజీ కమోడిటీ చట్ట ప్రకారం ఎలకా్ట్రనిక్‌ విడిభాగాల కొనుగోలు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తయారీదారుడి చిరునామా, బ్యాచ నెంబరు, గడువు తేది, ఎమ్మార్పీ, కాల్‌సెంటర్‌ నెంబరు తదితరాలను చూసి వస్తువులు కొనుగోలు చేయాలి. బిల్లును తప్పనసరిగా తీసుకోవాలి.   

ఫిర్యాదు చేయడంలో దిగువ స్థానం

వస్తువుల విషయంలో మోసపోయిన ఘటనల్లో చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. ఫిర్యాదుల విషయంలో జిల్లా దిగువ స్థాయిలో ఉంది. కొనుగోలు సమయంలో సరైన నియమాలు పాటించకపోవడం, కోర్టుల చుట్టూ తిరగడం ఇష్టంలేక పోవడం వంటి కారణాలతో ఎవరూ ముందుకురావడంలేదు. వస్తువుల కొనుగోలు విషయంలో నష్టపోతే జిల్లా కోర్టులోని వినియోగదారుల న్యాయస్థానంను ఆశ్రయిస్తే సదరు కంపెనీ నుంచి నష్టపరిహరం పొందవచ్చు. నాసిరకం వస్తువులు, తూకాలపై అనుమానాలు వస్తే  9542334242, 97016 06633 అనే నెంబర్లుకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. 

నేడు జాతీయ వస్తు నాణ్యత ప్రమాణ దినోత్సవం

వస్తువుల నాణ్యత ప్రమాణాల విషయంలో వినియోగదారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఏటా అక్టోబరు 14న  జాతీయ వస్తు నాణ్యత ప్రమాణ దినోత్సవం పేరిట కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. వస్తువుల నాణ్యత ప్రమాణాలు ఎలా ఉంటాయి, వాటిని కొనే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల్లో అధికారులు అవగాహన కల్పిస్తారు.  

 

Updated Date - 2021-10-14T06:14:07+05:30 IST