మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2021-10-22T04:15:49+05:30 IST

బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం వికటి ంచి 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులకు అస్వస్థత
ఇబ్రహీంపేట్‌లో పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

బాన్సువాడ, అక్టోబరు 21: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం వికటి ంచి 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత గంట సేపటి తర్వాత పాఠశాలలోని విద్యార్థు లకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుర య్యారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులందరూ పాఠశాలకు చేరుకుని విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను, మధ్యాహ్న భోజనం వికటించడానికి గల కారణాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురై న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల భవనం ముందు ఆందోళనకు దిగారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులు, వంట చేసే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం భోజనం పెట్టడం వల్లనే విద్యార్థులు తీవ్ర అవస్థతకు గురైనట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయు లు, మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థు ల తల్లిదండ్రులు ఉన్నతాఽధికారులను కోరుతున్నారు. విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనకు దిగడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు పాఠశాల కు చేరుకుని సముదాయించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు గ్రామంలోనే వైద్య పరీక్షలు అందజేశారు. మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో వారిని బాన్సువాడ మాత, శిశు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యా ర్థుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
విద్యార్థులను పరామర్శించిన స్పీకర్‌
మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశా లలో గురువారం మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ సరైన చికిత్స అందించాలని, మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను స్పీకర్‌ ఆదేశించారు.

Updated Date - 2021-10-22T04:15:49+05:30 IST