ఇద్దరు పిల్లులున్నారు, నేను మీ ముందుకు రాలేను..

ABN , First Publish Date - 2021-09-01T23:19:00+05:30 IST

''నేను ఇద్దరు శిశువుల తల్లిని, తక్కువ వ్యవధి కలిగిన నోటీసుతో ప్రయాణించ లేను'' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిర ..

ఇద్దరు పిల్లులున్నారు, నేను మీ ముందుకు రాలేను..

కోల్‌కతా: ''నేను ఇద్దరు శిశువుల తల్లిని, తక్కువ వ్యవధి కలిగిన నోటీసుతో ప్రయాణించ లేను'' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలియజేశారు. ఒక తల్లిగా తాను ఢిల్లీకి ఒంటరిగా ప్రయాణించి రాలేనని ఈడీ నోటీసుకు బుధవారంనాడు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.  స్వయంగా ప్రశ్నించేందుకు వారికున్న వీలును బట్టి ఈడీనే స్వయంగా తన నివాసానికే రావాలని కోరారు. పశ్చిమబెంగాల్‌లో మనీ లాండరింగ్, బొగ్గు స్మగ్లింగ్ కేసుల్లో ఆరోపణలకు సంబంధించి ఈడీ ఈ సమన్లు పంపింది.


''నేను ఇద్దరు శిశువుల తల్లిని. కరోనా మహమ్మారి సమయంలో నేను న్యూఢిల్లీ ప్రయాణించడం వల్ల నాతో పాటు నా పిల్లలకు కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కోల్‌కతాలోని నా నివాసంలోనే ప్రశ్నించే విషయం మీరు పరిశీలిస్తే నాకు వెసులుబాటు కలుగుతుంది. మీ ఈడీ కార్యాలయం కోల్‌కతాలో కూడా ఉంది. నేనూ కోల్‌కతాలోనే ఉంటున్నాను'' అని రుజిర ఈడీ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.


బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరి 23న సీబీఐ నేరుగా రుజిరను కోల్‌కతాలోని ఆమె నివాసంలోనే ప్రశ్నించింది. ఆమె సోదరి, ఇతర కుటుంబ సభ్యులను కూడా సీబీఐ బృందం ప్రశ్నిచింది. బొగ్గు స్మగ్లింగ్ కేసులో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్య రుజిరకు గత నెలలో ఈడీ నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 6న అభిషేక్‌ బెనర్జీని, 1న రుజిర, 3వ తేదీన వారి లాయర్ సంజయ్ బసును తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

Updated Date - 2021-09-01T23:19:00+05:30 IST