Abn logo
Sep 23 2020 @ 15:08PM

బిగ్‌బాస్‌4లో క్రేజ్‌ లేని కంటెస్టెంట్స్‌.. ఏం జరుగుతుంది?

Kaakateeya

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 మూడో వారంలోకి ప్రవేశించింది. కోవిడ్‌ వల్ల వచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్స్‌ లేకపోవడంతో ప్రేక్షకులకు టీవీలు, ఓటీటీలే ప్రధాన వినోదమాధ్యమాలుగా మారాయి. ఈ నేపథ్యంలో స్టార్‌ మా ప్రేక్షకులను తనవైపుకు ఆకర్షించుకోవడానికి తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4ను స్టార్ట్‌ చేసింది. తొలి మూడో సీజన్‌లపై ఉన్న అంచనాలతో నాలుగోసీజన్‌ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. మరి ప్రేక్షకుల అంచనాలను బిగ్‌బాస్‌ 4 అందుకున్నారా?  లేదా? అంటే లేదనే సమాధానమే వినపడుతుంది. అందుకు గల కారణాలనేకం... 


క్రేజ్‌ లేని కంటెస్టెంట్స్‌...

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభానికి ముందు అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆదిలోని హంసపాదు అనే చందాన కంటెస్టెంట్స్‌ దెబ్బకు ప్రేక్షకుల్లో బిగ్‌బాస్‌ 4పై ఆసక్తి తగ్గిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ కంటే ఈ నాలుగో సీజన్‌లో క్రేజ్‌ లేని కంటెస్టెంట్స్‌ను తీసుకోవడమే నిర్వాహకులు చేసిన పెద్ద తప్పిదంలా కనిపిస్తుంది. ఉన్న 16 మంది కంటెస్టెంట్స్‌లో చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. సరే! గేమ్‌ ప్లానింగ్‌ బావుందా?.. అంటే అది కూడా బాగోలేదనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయాయి. రేటింగ్స్ పరంగా చూస్తే తొలిరోజు ఉన్న రేటింగ్‌ ఇప్పుడు లేదు. ఇప్పటికీ బిగ్ బాస్ పై సీరియల్స్ డామినేషన్ స్పష్టంగా ఉంది.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీల్లోనూ అదే పంథా...

ఇప్పటి వరకు రెండు ఎలిమినేషన్స్‌ జరిగాయి... రెండు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు జరిగాయి. తొలిసారి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కుమార్‌సాయి  వల్ల షోలో కన్‌ఫ్యూజన్‌ మరింత పెరిగిందే కానీ... బిగ్‌బాస్‌లో స్పీడు పెరగలేదు. ఇక రెండో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అవినాష్‌.. ఇతను వచ్చిన తర్వాత కూడా షో చప్పగానే ఉంది. బిగ్‌బాస్‌ 4 క్రేజ్‌ తగ్గిపోతుందని పసిగట్టిన నిర్వాహకులు తొలి వారం నుండే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీని ప్రారంభించారు. క్రేజ్‌ పెంచుకోవడానికి కాస్తో కూస్తో క్రేజ్‌ ఉన్న కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపితే గేమ్‌ రసవత్తరంగా మారుతుంది.  రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతిదీక్షిత్ పరిస్థితి కూడా అదే... చేసిందే నాలుగు తెలుగుసినిమాలు, అందులోనూ ఒకటి కూడా సక్సెస్‌ లేదు. మరి క్రేజ్‌, ఇమేజ్‌ లేని ఆమెను మూడో వైల్డ్‌కార్డ్‌ ద్వారా ఎంట్రీ చేయిస్తే ఉపయోగమేంటో బిగ్ బాస్ కే తెలియాలి. తక్కువ పారితోషికం అనే ఉద్దేశంతో కంటెస్టెంట్స్‌ను తీసుకున్నట్లు అనిపిస్తుంది. మరి వారి స్ట్రాటజీ ఏమిటన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ...

Advertisement
Advertisement
Advertisement