Abn logo
Sep 8 2021 @ 07:15AM

IMD warning:ముంబై, థానే నగరాల్లో నేడు భారీవర్షాలు...ఆరంజ్ అలర్ట్

ముంబై : కొంకణ్ రీజియన్ పరిధిలోని ముంబై, థానే నగరాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ)బుధవారం విడుడల చేసిన వెదర్ బులెటిన్‌లో హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, థానే, పాల్ఘార్ జిల్లాల్లో నేడు, రేపు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. పాల్ఘార్ జిల్లాలో అతి భారీవర్షాలు కురుస్తాయని, దీంతో రెడ్ అలర్ట్ జారీచేసినట్లు ఐఎండీ వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై, థానే జిల్లాల్లో బుధవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు నదులు, చెరువులు, జలాశయాల వద్దకు ప్రయాణించవద్దని జిల్లా కలెక్టర్లు సూచించారు. 

భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదుల్లో వరదనీరు ప్రవహిస్తున్నందున బ్రిడ్జీల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు కోరారు. నదీ తీర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు రావాలని అధికారులు కోరారు. భారీవర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచుకోవాలని అధికారులు కోరారు.