Abn logo
Sep 16 2021 @ 09:40AM

IMD Warning: ఐదు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు

ఢిల్లీలో ఆరంజ్ అలర్ట్ జారీ

న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం విడుదల చేసిన తాజా వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది.మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గురువారం భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. 

దేశ రాజధాని అయిన ఢిల్లీలో గురువారం ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గురువారం భారీగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్కే జెనామణి తెలిపారు. ఢిల్లీలో భారీవర్షాలు కురుస్తున్నందున ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ నేడు, రేపు భారీవర్షాలు కురిసే అవకాశముందని శాస్త్రవేత్తలు చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండిImage Caption