IMD predicts: 5రోజుల పాటు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-08-10T13:28:10+05:30 IST

దేశంలోని పలు ప్రాంతాల్లో రాగల 5రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని...

IMD predicts: 5రోజుల పాటు భారీవర్షాలు

న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో రాగల 5రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాలు హిమాలయ పర్వతప్రాంతాలకు చేరువగా కొనసాగుతుండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్ లో తెలిపింది.భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.ఆగస్టు 10 నుంచి దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.


జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ నెల 10 నుంచి 13 తేదీల మధ్య భారీవర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు.బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే నాలుగు ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని, దీనివల్ల వరదలు వెల్లువెత్తుతాయని అధికారులు చెప్పారు.రాబోయే ఐదు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చమబెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.బంగాళాఖాతం నుంచి బలమైన గాలుల ప్రభావం వల్ల బుధవారం మేఘాలయలో భారీవర్షాలు కురుస్తాయి.


తమిళనాడు, కేరళ,పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, మహారాష్ట్ర ,గుజరాత్‌తో సహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరాఖండ్‌పై మరియు ఆగస్టు 12-13 తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌పై భారీ వర్షాలతో విస్తారంగారాబోయే ఐదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఆగస్టు 12-13 తేదీల్లో భారీ వర్షాలతో విస్తారంగా వరదలు వెల్లువెత్తవచ్చని ఐఎండీ అధికారులు వివరించారు.


Updated Date - 2021-08-10T13:28:10+05:30 IST