Abn logo
Aug 21 2021 @ 08:22AM

IMD predicts: ఆగస్టు 25వరకు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సబ్ హిమాలయన్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.ఈ మేర ఐఎండీ శనివారం తాజాగా వెదర్ బులెటిన్ ను విడుదల చేశారు.శనివారం గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. హర్యానా, చండీఘడ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. 

తుపాన్ ప్రభావం వల్ల విదర్భ పరిసర మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో శని,ఆదివారాల్లో భారీవర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్,కేరళ, మహారాష్ట్ర, రాయలసీమ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్,యానాంలలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.