జనవరి 14వరకు పలు రాష్ట్రాల్లో rainfall

ABN , First Publish Date - 2022-01-11T13:05:20+05:30 IST

దేశంలో పలు రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది....

జనవరి 14వరకు పలు రాష్ట్రాల్లో rainfall

ఐఎండీ వెదర్ బులెటిన్ జారీ 

న్యూఢిల్లీ: దేశంలో పలు రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జనవరి 14వతేదీ వరకు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేర తాజాగా ఐఎండీ వెదర్ బులెటిన్‌ను విడుదల చేసింది.వచ్చే నాలుగైదు రోజుల్లో అరేబియా, బంగాళాఖాతంల నుంచి గాలులు వీచే అవకాశం ఉంది. దీనివల్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం కురుస్తుందని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. విదర్భ, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలలో జనవరి 14 వరకు చాలా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


రానున్న రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్‌లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జనవరి 11, 13 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనవరి 13న విదర్భలో ఉరుములు, మెరుపులు,వడగళ్లతో వర్షం కురవవచ్చు. జనవరి 11న చత్తీస్‌గఢ్,జార్ఖండ్, బీహార్, గంగానది పశ్చిమ బెంగాల్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తెలంగాణలో 12న వర్షాలు కురిసే జనవరి 11-13 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్‌లో చాలా విస్తృతమైన వర్షపాతం, మంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 


జనవరి 12, 13 తేదీలలో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం,త్రిపురలలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాబోయే 4-5 రోజులలో కోస్తాంధ్ర, తెలంగాణాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. 

Updated Date - 2022-01-11T13:05:20+05:30 IST