Abn logo
Jul 27 2021 @ 08:35AM

IMD red alert: పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ కేంద్రం(ఐఎండీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఘాట్ ఏరియాల్లో రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లోనూ బుధవారం వరకు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. 

భారీవర్షాల నేపథ్యంలో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్పపీడన ప్రభావం వల్ల బెంగాల్ రాష్ట్రంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.మహారాష్ట్రలో భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 192 మంది మరణించగా, మరో 48 మంది గాయపడ్డారు.జులై 30వతేదీ వరకు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.