అరేబియా సముద్రంలో అల్పపీడనం!

ABN , First Publish Date - 2020-05-27T03:36:53+05:30 IST

అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ

అరేబియా సముద్రంలో అల్పపీడనం!

న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం పేర్కొంది. ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపిందని పేర్కొంది. 


అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ నెల 31 నుంచి జూన్ 4 వరకు సముద్రంపై చేపల వేటకు వెళ్ళరాదని ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2020-05-27T03:36:53+05:30 IST