తెలంగాణ, తమిళనాడులలో heavy rainfall...ఐఎండీ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-11-12T13:06:32+05:30 IST

తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది....

తెలంగాణ, తమిళనాడులలో heavy rainfall...ఐఎండీ హెచ్చరిక

చెన్నై:తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైలో వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాజధాని చెన్నైలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉండడంతో రాష్ట్రంలో వరదలు వెల్లువెత్తుతున్నాయి.



 దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం కొనసాగుతుందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.రానున్న 24 నుంచి 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.భారీవర్షాలతో చెన్నై విమానాశ్రయాన్ని ఐదు గంటలపాటు మూసివేశారు. దీంతో విమానాల రాకపోకలను నిలిపివేశారు.


Updated Date - 2021-11-12T13:06:32+05:30 IST