Abn logo
Aug 6 2021 @ 08:41AM

yellow alert: దేశంలో పలు ప్రాంతాల్లో భారీవర్షాలు

న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)తన తాజా వెదర్ బులిటెన్‌లో వెల్లడించింది.పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. శుక్రవారం పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురవనున్నందున ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్,మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఆగస్టు 9వతేదీ వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ శుక్రవారం ఉరుములు,మెరుపులతో కూడిన భారీవర్షాలు కురవనున్నందున వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.