Abn logo
Sep 26 2020 @ 03:38AM

ఆ ఇద్దరిపై అపార భక్తి

Kaakateeya

సంగీతం రాకపోయినా.. సినిమా పాటలు పాడాలంటూ తనను ప్రోత్సహించి, తన సినీరంగ ప్రవేశానికి కారణమైన ఎస్‌.జానకి అన్నా, శాస్త్రీయ సంగీతంలో అపారమైన పట్టున్న అద్భుత గాయకుడు ఏసుదాసు అన్నా బాలుకు ఎంతో ఇష్టం. కాదు కాదు.. అపారమైన భక్తి. అందుకే ఆయన వారిద్దరికీ ఘన సత్కారం చేశారు. 2018లో నెల్లూరు టౌన్‌ హాల్‌లో ఎస్‌.జానకిని ఘనంగా సత్కరించి, ఆమెకు పాదాభివందనం చేసి ఆమెపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

 ఇక.. తన అన్నయ్యగా, గురువుగా ఎప్పుడూ పేర్కొనే ఏసుదాసుకైతే సతీసమేతంగా కాళ్లు కడిగి, పుష్పాలతో పాదపూజ చేసి గౌరవించుకున్నారు. ఏసుదాసు కూడా బాలు పట్ల అంతే అభిమానంతో ఉండేవారు. ‘‘బాలు నాకు సోదరుడు మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఒకే గర్భంలో పుడితేనే సోదరుడా? ఒక్క మాటలో చెప్పాలంటే.. మేము ద్వైతం కాదు ఏకం. సంగీతంతో కలిసి ఉన్నాం. మా తల్లి సరస్వతి’’ అని చెప్పారు.


Advertisement
Advertisement
Advertisement