Abn logo
Sep 19 2021 @ 23:26PM

జిల్లాలో వైభవంగా గణేష్‌ నిమజ్జనం

వాంకిడిలో శోభాయాత్ర

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 19: పట్టణంలోని శ్రీ సరస్వతీశిశు మందిర్‌ పాఠశాలలోని వినాయకుడి నిమజ్జనం సందర్భం అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద వాగులో గణనాథుడిని నిమజ్జనంచేశారు. బాపున గర్‌ శారదగణేష్‌ మండపంవద్ద రూ.11వేలకు పుల్లూరిరవి వేలంపాడి లడ్డూ దక్కించుకున్నారు. 

కెరమెరి/బెజ్జూరు/దహెగాం/చింతలమానేపల్లి/సిర్పూర్‌(టి)/ సిర్పూర్‌(యూ)/ పెంచి కలపేట/ కౌటాల/వాంకిడి/రెబ్బెన/ జైనూరు /కాగజ్‌నగర్‌రూరల్‌: మండలాల్లో నిమజ్జనం సందర్భంగా ఆయా గ్రామాల్లోని మండపాల వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. యువ కులు భాజాభజంత్రీల మధ్య ఆనందోత్సహాలతో సమీప వాగుల్లో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ఆయామండలాల ఎస్సైలు రమేష్‌, సాగర్‌, సందీప్‌కుమార్‌, రవికు మార్‌, రమేష్‌, ఆంజనే యులు, ఎస్సైడీకొండ రమేష్‌, రెబ్బెనలో సీఐ సతీష్‌కుమార్‌, ఎస్సై భవానీగౌడ్‌, కాగజ్‌నగర్‌ రూరల్‌లో డీఎస్పీకరుణాకర్‌ బందోబస్తు నిర్వహించారు.