ఇమ్యూనిటీ కోసం...

ABN , First Publish Date - 2021-05-12T17:24:18+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ ఒక్కటే మనల్ని కాపాడుతుంది. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మంచి ఆహారం ఒక్కటే మార్గం. ఇందుకోసం ఏం చేయాలంటే...

ఇమ్యూనిటీ కోసం...

ఆంధ్రజ్యోతి(12-05-2021)

ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ ఒక్కటే మనల్ని కాపాడుతుంది. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మంచి ఆహారం ఒక్కటే మార్గం. ఇందుకోసం ఏం చేయాలంటే... 


కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్‌, విటమిన్‌ ఎ, డి ఉంటాయి. ఎగ్‌వైట్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లను అడ్డుకునేందుకు తోడ్పడతాయి. 

పాలకూర, మెంతి, బ్రకోలీ, మునగాకులు...వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలిక్‌ ఆసిడ్‌, ఐరన్‌, ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. వారంలో కనీసం మూడురోజులు వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీకి ఢోకా ఉండ దు.

స్వీట్‌కార్న్‌లో విటమిన్‌ బి12, ప్రొటీన్స్‌, ఫైబర్‌ అధికంగా లభిస్తాయి. సలాడ్‌, సూప్స్‌ రూపంలో ఇతర డిష్‌లతో కలిపి తీసుకున్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

విటమిన్‌ ‘ఎ’ అత్యధికంగా కందగడ్డలో లభిస్తుంది. అంతేకాకుండా ఫోలికాసిడ్‌, ఫైబర్‌ కూడా ఉంటాయి. వారంలో రెండు రోజులు తిన్నా చాలు.

వాల్‌ నట్స్‌, బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటివి ఎక్కువగా తినాలి. వీటిలో ఉండే ప్రొటీన్స్‌, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్‌ ఇమ్యూనిటీని పెంచుతాయి.

తులసిలో కాల్షియం, పొటాషియం, జింక్‌, యాంటీకేన్సర్‌ గుణాలుంటాయి. తులసిని గ్రీన్‌టీతో తీసుకోవచ్చు. సలాడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు. 

జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను తరిమేయడానికి అల్లం ఉపకరిస్తుంది. లెమన్‌ జ్యూస్‌తో అల్లాన్ని కలిపి తీసుకుంటే ఫలితం బాగుంటుంది.

ఇమ్యూనిటీని పెంచడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా చూస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేస్తుంది.

Updated Date - 2021-05-12T17:24:18+05:30 IST