వ్యాధి నిరోధకశక్తిని పెంచే హోమియో!

ABN , First Publish Date - 2020-03-09T06:54:12+05:30 IST

వ్యాధినిరోధకంగా హోమియో మందు వేసుకున్నా, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పానీయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

వ్యాధి నిరోధకశక్తిని  పెంచే హోమియో!

వ్యాధినిరోధకంగా హోమియో మందు వేసుకున్నా, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పానీయాలు  తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందులో భాగంగా విటమిన్‌- సి సమృద్ధిగా  లభించే బత్తాయి, కమలా పండ్లు తినాలి. అల్లం రసం, నిమ్మరసం తరచుగా తాగాలి. 


కొత్త వైరస్‌ ఏదో వచ్చి ప్రాణాలు తీసేస్తోందని తెలిస్తే చాలు.... అందరూ బెంబేలెత్తిపోతుంటారు. కానీ, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడటానికి వచ్చిపడిన వైరస్‌ కాదు, మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోవడమే అసలు కారణం. ఆ శక్తిని నిలకడగా ఉంచుకోవడం, ఇంకా పెంచుకునే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఆ మాటకొస్తే కలుషితమైన ఆహార పానీయాలు, వాతావరణ కాలుష్యం వ్యాధి నిరోధక శక్తిని బాగా తగ్గిస్తున్నాయి. విదేశాల్లో అయితే సూర్యరశ్మి కూడా సరిగా లభ్యం కాక వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతోంది. దాని పరిణామంగానే కొన్ని రకాల వైరస్‌లకు వణికిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు మానవాళిని భయాందోళలనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ విషయంలో అదే జరుగుతోంది.


ఈ స్థితిలో ఎవరైనా చేయవలసింది ఒక్కటే. వ్యాధినిరోధక శక్తిని బాగా పెంచుకోవడం. కరోనా వైరస్‌ సోకిన వారిలో  జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధి సోకినా ఈ లక్షణాలే కనిపిస్తాయి. అందువల్ల వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా వైరస్‌ను గుర్తిస్తే తప్ప అది  కరోనాయే అని నిర్ధారణకు రావడం  సాధ్యం కాదు. వైరస్‌ సోకిన తర్వాత చికిత్సలు తీసుకోవడం అంతా వేరు. అసలు వైరస్‌ సోకకుండా నిరోధించే ప్రయత్నం అన్నింటికన్నా ముఖ్యం. ఆ దృష్టితోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఒక హోమియో మందును ఆమోదించింది.

ఆర్సనిక్‌ ఆల్బ్‌ - 30 అనే ఈ మందును రోజుకు డోసు చొప్పున మూడు రోజలు వరుసగా వేసుకోవాలి. ఆ తర్వాత వారం రోజులు ఆగి, మళ్లీ మూడు రోజులు వరుసగా వేసుకోవాలి.  

- డాక్టర్‌ కె. గోపాల కృష్ణ

హోమియో వైద్య నిపుణులు, హైదరాబాద్‌

Updated Date - 2020-03-09T06:54:12+05:30 IST