రోగనిరోధకశక్తికి మహాసుదర్శన ఔషధం!

ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST

క్రమం తప్పిన ఆహార, జీవనశైలి ఫలితంగా రోగనిరోధకశక్తి సన్నగిల్లి, తేలికగా వ్యాధుల బారిన పడుతున్నాం. ఇందుకు వీలు లేకుండా సహజసిద్ధమైన రోగనిరోధకశక్తి శరీరంలో పెంపొందాలంటే మహాసుదర్శన ఔషధాన్ని తీసుకోవాలి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన రసతంత్రసార....

రోగనిరోధకశక్తికి మహాసుదర్శన ఔషధం!

క్రమం తప్పిన ఆహార, జీవనశైలి ఫలితంగా రోగనిరోధకశక్తి సన్నగిల్లి, తేలికగా వ్యాధుల బారిన పడుతున్నాం. ఇందుకు వీలు లేకుండా సహజసిద్ధమైన రోగనిరోధకశక్తి శరీరంలో పెంపొందాలంటే మహాసుదర్శన ఔషధాన్ని తీసుకోవాలి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన రసతంత్రసార సిద్ధప్రయోగ సంగ్రహంలో మహాసుదర్శన చూర్ణంగా పేర్కొన్న మహాసుదర్శన ఔషధంలో పలు మూలికల సారం ఉంటుంది. దీనిలో నేలవేము (కిరాతకి లేదా మహాతిక్క), తిప్పతీగ (కటుకరోహిణి), చిత్రమాలము, తుంగమస్తల, త్రిఫల, త్రికటు మొదలైన 56 మూలికలు ఉంటాయి. 


ఉపయోగాలు: త్రిదోషములు హరిస్తుంది. సర్వజ్వరములను హరిస్తుంది. జ్వరాలలో జీర్ణ జ్వరం, ధాతు జ్వరం, విషమ జ్వరం, సన్నిపాత జ్వరం, మానసిక జ్వరం, శీత జ్వరం, జ్వరంతో కూడిన తలనొప్పి, ఒళ్లునొప్పులు, కామెర్లు, రక్తలేమి, సాధారణ దగ్గు, జలుబు, ప్రమేహ, భ్రమ, కాస, శ్వాస, పాండు, హృద్రోగ, కామల, త్రికశూల, పృష్టశూల, కటిశూల, జానుశూల, పార్శ్వశూలకు ఈ ఔషధం విశేషంగా పనిచేస్తుంది. ప్లీహం, కాలేయం సంబంధిత రోగాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. శారీరక తత్వాన్ని అనుసరించి ఈ ఔషధాన్ని మూడు రూపాల్లో ఇవ్వవలసి ఉంటుంది. చూర్ణంగా, మహాసుదర్శన ఖ్వాదము, మాత్రల రూపంలో ఇవ్వవచ్చు. 


గుణాలు: ఆమపంచకం (విషాలను హరిస్తుంది), నాడుల సంరక్షణ (జ్వరంతో ఉన్నప్పుడు), మలేరియా, టైఫాయిడ్‌లకు వ్యతిరేకం, యాంటీవైరల్‌, గుండెకు రక్షణ, ఆకలి పెంచేది, యాంటీ ఆక్సిడెంట్‌.



డాక్టర్‌ శశిధర్‌

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, చీరాల.

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST