ఈ వర్షాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు: కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-06-03T22:58:36+05:30 IST

ఈ వర్షాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు.

ఈ వర్షాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు: కేసీఆర్‌

హైదరాబాద్: ఈ వర్షాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలన్నారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తామని తెలిపారు. ఎరువులు, పురుగు మందుల వాడకంలో శాస్త్రీయత ఉండాలని, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలన్నారు. తెలంగాణలో పండే పత్తికి మంచి డిమాండ్ ఉందని కేసీఆర్‌ తెలిపారు.

Updated Date - 2020-06-03T22:58:36+05:30 IST