పథకాల అమలుతీరు భేష్‌

ABN , First Publish Date - 2021-10-22T05:09:06+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో అమలవుతున్న పథకాల

పథకాల అమలుతీరు భేష్‌
మహిళా సంఘాల సభ్యులతో కేంద్ర బృందం ముఖాముఖి

  • ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో కేంద్ర మానిటరింగ్‌ బృందం పర్యటన 


ఆమనగల్లు /కడ్తాల్‌ : కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో అమలవుతున్న పథకాల అమలు తీరు పట్ల కేంద్ర మానిటరింగ్‌ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ పథకాల ద్వారా జరుగుతున్న అభి వృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలిస్తున్నాయని వారు ప్రశంసించారు. ఆమనగల్లు మం డలం మేడిగడ్డ, కడ్తాల మండలం మైసిగండి గ్రామాల్లో గురువారం కేంద్ర మానిటరింగ్‌ బృందం పర్య టించింది. ప్రొఫెసర్‌ సౌందర్‌ పాం డియన్‌ నేతృత్వంలో చెన్నై స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ది గాంధీ గ్రామ్‌ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నెహ్రు, సూర్యనారాయణ బృందం ఆయా గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అమలవుతున్న పనులు, కూలీలకు లభిస్తున్న ఉపాధి, జాబ్‌కార్డుల పంపిణీ తీరు, కూలీ డబ్బుల చెల్లింపులు, సీసీరోడ్ల నిర్మాణం, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డ్‌ల నిర్మాణం, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఉపాధి కూలీలతో వారు మాట్లాడి లభిస్తున్న కూలీ, సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పొదుపు వివరాలు, పావలావడ్డీ, రుణాల మంజూరు, చెల్లింపు విధానం గురించి మహిళా సంఘాల సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆయా గ్రామాల్లో ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయి, సకాలంలో డబ్బు చెల్లిస్తున్నారా అని కేంద్ర బృందం ఆరా తీసింది. మైసిగండి, మేడిగడ్డలో స్వయం ఉపాధి ద్వారా ఏర్పాటు చేసుకున్న యూనిట్లను బృందం సభ్యులు పరిశీలించి పొందుతున్న ఆదా యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఏపీడీ నీరజ, ఎంపీడీవో వెంకట్రా ములు, రామకృష్ణ, ఎంపీపీ అనితవిజయ్‌, ఏపీవోలు మాధవరెడ్డి, అంజయ్య సర్పంచ్‌లు తులసీరామ్‌నాయక్‌, అంబర్‌సింగ్‌, ఉపసర్పంచ్‌లు రాజారామ్‌, మల్లేశ్‌, ఎంపీవోలు తేజ్‌సింగ్‌, ఉమారాణి, పంచాయతీ కార్యదర్శులు సత్యం, కృష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-22T05:09:06+05:30 IST