Abn logo
Sep 21 2021 @ 23:30PM

పనితీరు మెరుగుపరుచుకోవాలి: జేసీ

కవిటి: సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు


కవిటి: సచివాలయాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని జేసీ శ్రీనివా సులు తెలిపారు. మంగళవారం వరక గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థను పటిష్టంచేసి గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో సూర్యనారాయణ  పాల్గొన్నారు. ఫ సోంపేట రూరల్‌ : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయాలని జేసీ కె.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం  గొల్లగండిలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. అనంతరం సచివాలయం తనిఖీ చేసి సిబ్బంది పనితీ రుపై సమీక్షించారు.  ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఫ కంచిలి:  తలతంపరలోని సచివాలయాన్ని  జేసీ శ్రీనివాసులు  తనిఖీచేశారు. ఫ పాలకొండ: ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని  కమిషనర్‌  రామారావు తెలిపారు.   పాలకొండ నగర పంచాయతీలోని తెలుకలవానిచెరువు వద్ద ఉన్న డంపింగ్‌యార్డులో చెత్త పేరుకుపోవడంతో జేసీబీతో  దగ్గరుండి తొలగించారు.