మెరుగైన వర్క్‌ ఫ్రం హోమ్‌

ABN , First Publish Date - 2021-03-03T05:45:57+05:30 IST

ఇప్పటికీ ఎంతో మంది ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. అయితే ఇంటి పట్టున ఉన్నా ఆఫీసులో ఉన్నంత సమర్థంగా ఉద్యోగాలు చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి

మెరుగైన వర్క్‌ ఫ్రం హోమ్‌

ఇప్పటికీ ఎంతో మంది ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. అయితే ఇంటి పట్టున ఉన్నా ఆఫీసులో ఉన్నంత సమర్థంగా ఉద్యోగాలు చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.


ఇంటి వాతావరణం రిలాక్సింగ్‌గా ఉంటుంది కాబట్టి ఆఫీసు పనికి ఏదో ఒక ప్రదేశంలో సెటిలైపోతూ ఉంటాం. ఇందుకోసం ల్యాప్‌టాప్‌తో సోఫాల మీద ఒరిగిపోతాం. లేదా బెడ్‌ మీదే జారిగిలపడతాం. కానీ ఈ అలవాటుతో పని నాణ్యత తగ్గడంతోపాటు, శరీర భంగిమలకు సంబంధించి పొరపాట్లు చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆఫీసు పని కోసం ఓ డెస్క్‌, కుర్చీ కేటాయించుకోవాలి.


ఆఫీసులో ఉన్నప్పుడు ఒకరితో మరొకరు ఆలోచనలు పంచుకుంటూ పని చేస్తాం కాబట్టి కమ్యూనికేషన్‌కు ఇబ్బంది ఉండదు. కానీ వర్క్‌ ఫ్రం హోమ్‌ పరిస్థితి వేరు. కమ్యూనికేషన్‌ లోపిస్తే, ఎంప్లాయిస్‌ నిర్లక్ష్యానికి గురయిన భావనకు లోనవుతారు. కాబట్టి టీమ్‌ మేనేజర్లు ఎంప్లాయిస్‌ మధ్య మెసేజీలు, ఆడియో, వీడియో కాల్స్‌ ద్వారా అసైన్‌మెంట్లు, ప్రాజెక్టుల సంబంధించిన కమ్యూనికేషన్‌ సౌకర్యాలు కల్పించాలి.


వర్క్‌ ఫ్రం హోమ్‌ అంటే, మనసు మళ్లేలా చేసే అంశాల మధ్య పనిచేయవలసి ఉంటుంది. వాటి కారణంగా పని నాణ్యత దెబ్బతినకుండా ఉండాలంటే పని వేళలు, ప్రదేశాల పట్ల కచ్చితంగా వ్యవహరించాలి. టివి, వంటగది లాంటి శబ్దాలతో కూడిన ప్రదేశాలకు దూరంగా డెస్క్‌, ఛెయిర్‌ ఏర్పాటు చేసుకోవాలి. కచ్చితమైన ఆఫీసు వేళలను ఇంట్లోనూ పాటించాలి.


ఇంటి పట్టున ఉన్నా పని వేళల్లో ఆఫీసు దుస్తులు ధరించడం వల్ల వర్క్‌ మూడ్‌లోకి చేరుకోగలుగుతాం. ఇంట్లోనే కదా? అని పైజమా లేదా నైట్‌ డ్రస్‌లోనే ఆఫీసు పనికి పూనుకుంటూ పని అనుకున్నంత చక్కగా సాగదు.

Updated Date - 2021-03-03T05:45:57+05:30 IST