కశ్మీర్‌కు బ్రాండ్ అంబాసిడర్ నేనే: పాక్ ప్రధాని

ABN , First Publish Date - 2021-07-19T05:01:51+05:30 IST

అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌కు తానే బ్రాండ్ అంబాసిడర్ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆదివారం నాడు జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్‌కు బ్రాండ్ అంబాసిడర్ నేనే: పాక్ ప్రధాని

ఇస్లామాబాద్: అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌కు తానే బ్రాండ్ అంబాసిడర్ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆదివారం నాడు జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగక..బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలం నుంచి భారత్ అత్యధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. ‘‘ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలమే భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం. ఇది కేవలం ముస్లింలనే కాకుండా, సిక్కులు, క్రైస్తవులు, వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీపైనా ఇమ్రాన్ ఖాన్ ఫైరయ్యారు. ఈ ఆర్టికల్ నిర్వీర్యమైన నాటి నుంచీ కశ్మీర్ వాసులపై అరచకాలు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికల్లో తానే కశ్మీర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని, కశ్మీర్ ప్రజల న్యాయపోరాటానికి పాక్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-07-19T05:01:51+05:30 IST