Pakistan: పెట్రోల్ లీటరు ధర రూ.5ల పెంపు

ABN , First Publish Date - 2021-07-16T14:47:05+05:30 IST

ఆర్థిక సంక్షోభంలో పడిన పాకిస్థాన్ దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశన్నంటాయి....

Pakistan: పెట్రోల్ లీటరు ధర రూ.5ల పెంపు

ఇమ్రాన్ఖాన్ సర్కారు నిర్ణయం 

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): ఆర్థిక సంక్షోభంలో పడిన పాకిస్థాన్ దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశన్నంటాయి. పెట్రోల్ లీటరు ధర 5.40రూపాయలుచ హైస్పీడ్ డిజిల్ లీటరు ధర 2.54 రూపాయలు పెంచుతూ ఇమ్రాన్ ఖాన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా పెట్రో ధరల పెంపుతో పాక్ ప్రజలపై అదనపు భారం పడింది. పాకిస్థాన్ దేశంలో పెట్రోల్ లీటరు ధర రూ.118.09, డీజిల్ ధర రూ.116.5కు పెరిగింది. పెట్రోలుతోపాటు కిరోసిన్, లైట్ డీజిల్ ధరలు కూడా పెంచారు. కిరోసిన్ లీటరు ధర 1.39 పైసలు పెంచారు. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ సిఫార్సుల మేర తాము పెట్రో ధరలు పెంచామని పాక్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ షహబాజ్ గిల్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరగడంతో పాక్ లో ధరలు పెంచక తప్పలేదని గిల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెటుకు అనుగుణంగా చమురు ధరలను పెంచడం తప్పలేదని పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి చెప్పారు. 


Updated Date - 2021-07-16T14:47:05+05:30 IST