మంజునాథ్, తనిష్క్ జంటగా యస్వీ మంజునాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల్ని, ట్రైలర్‌ను కె.యల్ దామోదర ప్రసాద్, టి.ప్రసన్న కుమార్ విడుదల చేశారు. దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ప్రేమకథలన్నీ ఒకేలా ఉంటాయి. ప్రజంటేషన్లో కొత్తదనం చూపించాలి. ఈ సినిమా ట్రైలర్ కొత్తగా ఉంది’’ అని అన్నారు. మంజునాథ్ మాట్లాడుతూ ‘‘గ్రామీణం నేపథ్యంలో సాగే లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా; కళ్యాణ్ సమి, సంగీతం; జయసూర్య, ఎడిటర్; ఆవుల వెంకటేశ్.