Abn logo
Apr 19 2021 @ 21:42PM

మరో వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనయుడు

పటాన్‌చెరు: స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పటాన్‌చెరులోని ఏపీఆర్ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డును విష్ణు చితకబాదాడు. సొసైటీ మెయిన్ గేట్ వద్ద విష్ణు వాహనాన్ని సెక్యూరిటీ గార్డు ఆపాడు. థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు శానిటైజేషన్ తరువాతనే సొసైటీ లోపలికి వెళ్లాలని విష్ణుని సెక్యూరిటీ గార్డు కోరాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ సెక్యూరిటీ గార్డుపై విష్ణు చేయి చేసుకున్నాడు. ఈ దృష్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. 

Advertisement
Advertisement
Advertisement