బిహార్‌లో జేడీయూ 115, బీజేపీ 128 చోట్ల పోటీ

ABN , First Publish Date - 2020-09-19T07:46:56+05:30 IST

బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్‌ (యునైటెడ్‌)(జేడీయూ) 115 స్థానాలకు పోటీచేసి, బీజేపీకి 128 స్థానాలు వదిలివేయనున్నట్లు ఆ

బిహార్‌లో జేడీయూ 115, బీజేపీ 128 చోట్ల పోటీ

పట్నా, సెప్టెంబరు 18 : బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో  జనతాదళ్‌ (యునైటెడ్‌)(జేడీయూ) 115 స్థానాలకు పోటీచేసి, బీజేపీకి 128 స్థానాలు వదిలివేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీజేపీ తమ వాటా స్థానాలలో కొన్నింటిని లోక్‌జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)కి కేటాయించనుంది. ఎల్‌జేపీ దూకుడుగా ఉన్న నేపథ్యంలో సీట్ల సర్ధుబాటు విషయంలో జేడీయూ, బీజేపీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా యి. 115 స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ పట్టుపడుతున్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి.


‘‘2010 లో జేడీ యూ, బీజేపీ మాత్రమే ఉన్నందున సమస్యలు తలెత్తలేదు. గ్రాండ్‌ అలయన్స్‌లో భాగంగా 2015 ఎన్నికల్లో మేం 101 స్థానాలలో పోటీ చేశాం. మళ్లీ మేం ఇప్పుడు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌(డీఎన్‌ఏ)లో భాగస్వాములైనందున 115సీట్లకు వత్తిడితెస్తున్నాం. బీజేపీ ఎల్‌జేపీకి కొన్ని సీట్లు కేటాయిస్తున్నందున, మేము మావాటా నుంచి జితన్‌ రా మ్‌ మంజీకి చెందిన హిందూస్థానీ అవామీ మోర్చాకు కొ న్ని సీట్లు కేటాయిస్తాం’’ అని జేడీయూ వర్గాలు తెలిపాయి. జేడీయూకు 71మంది, బీజేపీకి 53మంది ఎమ్మెల్యేలున్నారు. 


Updated Date - 2020-09-19T07:46:56+05:30 IST