అంగన్‌వాడీ కేంద్రాలు సమర్థంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-04-21T05:49:52+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలు సమర్థంగా పనిచేయాలి

అంగన్‌వాడీ కేంద్రాలు సమర్థంగా పనిచేయాలి

ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య 

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20 : అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థంగా నిర్వర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఐసీడీఎస్‌ అధికారులతో సమావేశమయ్యారు.  చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. చిన్నారులు, మహిళల ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమంలో ఐసీడీఎస్‌ అఽధికారులదే కీలక పాత్ర అన్నారు. సంక్షేమ శాఖ అధికారి నుంచి అంగన్‌వాడీ టీచర్ల వరకు సమర్థంగా విధులు నిర్వర్తించాలన్నారు. అంగన్‌ వాడీ భవనాలు, కేంద్రాల్లోని సౌకర్యాలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు తదితర సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. 

రహదారి ప్రమాదాలను  అరికట్టాలి 

 రహదారి ప్రమాదాలను సమన్వయంతో అరికట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య రవాణా, పోలీస్‌ శాఖల అధికారులను ఆదేశించారు. ఇల్లందు క్లబ్‌ హౌస్‌లో నిర్వహించిన రోడ్డుభద్రత కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  రేగొండ నుంచి మహదేవపూర్‌ వరకు ఉన్న రహదారిపై  తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. రోడ్డుప్రమాదాల వల్ల అభం శుభంలేని చిన్నారులు చనిపోవడం కలిసి వేసిందన్నారు. ఇసుక లారీలు నిర్ణీత సమమంలో మాత్రమే నడిచేలా చూడాలన్నారు. గణపురం మండలం మైలారం, కాలారం మండలం మేడిపల్లి, కాటారం, మహదేవపూర్‌ మధ్య  ఇసుక లారీల హోల్డింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక లారీపై లారీ ఓనర్‌, డ్రైవర్‌, క్లీనర్ల వివరాలను పొందుపర్చాలన్నారు. ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ అమలు చేయాలన్నారు.  30 మందిని నియమించుకొని అధిక లోడ్‌తో వచ్చే లారీలను నియంత్రించలన్నారు. సమావేశంలో డీటీవో వేణు, డీఎస్పీలు సంపత్‌రావు, బోనాల కిషన్‌, టీఎ్‌సఎండీసీ పీవో రవి, ఎంవీఐలు శ్రీనివాస్‌, సమ్దాని తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T05:49:52+05:30 IST