వాటికి పోటీగా... న్యూ హోండా అమేజ్ ఫేస్​లిఫ్ట్​...

ABN , First Publish Date - 2021-08-19T22:38:45+05:30 IST

జపనీస్​ కార్​ బ్రాండ్​ హోండాను భారత మార్కెట్​లో విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్​ అమేజ్​లో కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్​ చేసింది.

వాటికి పోటీగా... న్యూ హోండా అమేజ్ ఫేస్​లిఫ్ట్​...

హైదరాబాద్ : జపనీస్​ కార్​ బ్రాండ్​ హోండాను భారత మార్కెట్​లో విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్​ అమేజ్​లో కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్​ చేసింది. ఈ కొత్త మోడల్​ మొత్తం మూడు ట్రిమ్(ఈ, ఎస్​, విఎక్స్​) వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. వేరియంట్​ను బట్టి ఢిల్లీ ఎక్స్​ షోరూంలో రూ. 6.32-రూ. 11.15 లక్షల మధ్య అందుబాటులో ఉంటాయి. ఇవి పెట్రోల్​, డీజిల్​ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తాయి. ఇక​ 1.2 లీటర్ ఇంజిన్​తో కూడుకున్న పెట్రోల్​ వేరియంట్... 90 హచ్​​పీ పవర్​, 110 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్​ 5 స్పీడ్​ గేర్​బాక్స్​తో వస్తోంది. 


ఇక... డీజిల్​ వేరియంట్​ అయితే 1.5 లీటర్ ​ఇంజిన్​తో వస్తోంది. ఇది 100 హెచ్​పి పవర్, 200 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్​ మాన్యువల్​ గేర్​బాక్స్​తో వస్తుంది. దీని సీవీటీ గేర్​బాక్స్​ 80 హెచ్​పి పవర్​, 160 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్​ అయితే 18.6 కిలో మీటర్లు, డీజిల్​ అయితే 24.7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.


ఆన్​లైన్​ బుకింగ్​ కోసం కంపెనీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డీలర్​షిప్​ సెంటర్​ ద్వారా బుకింగ్​ చేసుకోవాలనుకుంటే రూ. 21 వేలు చెల్లించాలి. ఈ అమేజ్​ ఫేస్​లిఫ్ట్​ సెడాన్​ కారు మారుతి సుజుకి డిజైర్​, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్​, ఫోర్డ్​ అస్పైర్​ కార్లకు గట్టి పోటీనివ్వనున్నట్లు భావిస్తున్నారు. 

Updated Date - 2021-08-19T22:38:45+05:30 IST