కరోనా అయితే మాకేంటి..!

ABN , First Publish Date - 2020-07-06T10:32:32+05:30 IST

కరోనా కట్టడి చర్యల్లో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన రెవెన్యూ సిబ్బంది కట్టు తప్పారు.

కరోనా అయితే మాకేంటి..!

 ప్రభుత్వ కార్యాలయంలో పుట్టిన రోజు వేడుకలు 

పాల్గొన్న అధికారులు


బల్లికురవ, జూలై 5:  కరోనా  కట్టడి చర్యల్లో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన రెవెన్యూ సిబ్బంది కట్టు తప్పారు.  తహ సీల్దార్‌ కార్యాలయం లోనే ఓ ఉద్యోగి పుట్టి న రోజు వేడు కను జరుపుకోవడం వివాదా స్పద మైంది. బల్లికురవ తహసీల్దార్‌ కా ర్యాలయంలో శనివారం సాయంత్రం అక్కడ పని చేస్తున్న కాంట్రాక్టు  కం ప్యూటర్‌ ఆపరేటర్‌ పుట్టిన రోజు వేడు కను నిర్వహించారు.  చీమకుర్తి తహ సీల్దార్‌ మధు సూదనరావు ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఆయన లేకుం డానే తహసీల్దార్‌ టేబుల్‌పై కేక్‌ను కట్‌   చేశారు. మాస్కులు లేకపోగా కనీసం భౌతిక దూరం కూడా పాటించలేదు. ఇదిచూసిన ప్రజలు విస్మ యానికి గురయ్యారు. బల్లికురవ మండ లంలోని కొప్పె రపాడు, కె.రాజుపాలెంలో వైరస్‌ ఉధృతంగా ఉండడం తెలిసిందే. ఇ ప్పటికే ఇద్దరు మృతి చెందారు. అవేమీ లెక్క చేయ కుండా రెవెన్యూ సి బ్బంది పుట్టిన రోజును నిర్వహించారు.  ఇది ఆదివారం సోషల్‌ మీడి యాలో హల్‌చల్‌ చేసింది.

Updated Date - 2020-07-06T10:32:32+05:30 IST