Abn logo
Sep 19 2021 @ 19:51PM

ఇక ‘డిజిటల్’ లోనే...

న్యూఢిల్లీ : కొత్త సిమ్ కార్డు తీసుకోవడం, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రిపెయిడ్‌కు మారడం, లేదా... ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ వంటి సేవలు సలుభంగానే పొందొచ్చు. మొత్తంగా మొబైల్ వినియోగదారులకు ఆయా సేవలకు సంబంధించి పూర్తి వెసులుబాటు కలగనుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


కొత్త ఫోన్ కనెక్షన్ పొందటానికి, అంటే సిమ్ కార్డు తీసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పని లేదు. అంతా డిజిటల్ మార్గంలోనే పూర్తవుతుంది. టెలికం కంపెనీలు ఫామ్స్ అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకుంటాయి. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రిపెయిడ్‌కు మారాలన్నా, ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారాలన్నా కూడా ఇది వర్తిస్తుంది. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. డిజిటల్ మార్గంలోనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.


కేవైసీ కోసం కస్టమర్ కేర్ సెంటర్‌కు వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పని లేదు. ఇంటినుంచే పని పూర్తి చేసుకోవచ్చు. సిమ్ కార్డు కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి సెల్ఫ్ కేవైసీ పూర్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. దీనికి ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నాయి.