హస్తంలో.. దండోరా వివాదం..!

ABN , First Publish Date - 2021-08-02T04:01:28+05:30 IST

ఏఐసీసీ కార్యక్రమాల అమలు క మిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డికి పీసీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డి మధ్య చోటు చేసుకున్న రాజకీయాల వ్యవహారాల అంశం ప్రస్తుతం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారుతోంది. శనివారం గాంధీభవన్‌లో ఏ ర్పాటు చేసిన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో రేవంత్‌ రె డ్డి వ్యవహార శైలిపై మహేశ్వర్‌రెడ్డి నిలదీసినట్లు మీడియాలో వెల్లువె త్తిన ప్రచారం హట్‌ టాఫిక్‌గా మారుతోంది.

హస్తంలో.. దండోరా వివాదం..!

ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న కార్యక్రమంపై మహేశ్వర్‌రెడ్డికి అందని సమాచారం
ఇదే విషయంపై రేవంత్‌రెడ్డిని నిలదీసిన వైనం  
జిల్లా శ్రేణుల్లో చర్చనీయాంశం

నిర్మల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):
ఏఐసీసీ కార్యక్రమాల అమలు క మిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డికి పీసీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డి మధ్య చోటు చేసుకున్న రాజకీయాల వ్యవహారాల అంశం ప్రస్తుతం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారుతోంది. శనివారం గాంధీభవన్‌లో ఏ ర్పాటు చేసిన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో రేవంత్‌ రె డ్డి వ్యవహార శైలిపై మహేశ్వర్‌రెడ్డి నిలదీసినట్లు మీడియాలో వెల్లువె త్తిన ప్రచారం హట్‌ టాఫిక్‌గా మారుతోంది.
మొదటి నుంచి పార్టీకి అన్ని తానై..
మొదటి నుంచి పార్టీకి అన్ని తానై అనేక వ్యయ ప్రయసాలను ఓ ర్చుకుంటూ ఉన్న కేడర్‌ను కాపాడుకునేందుకు మహేశ్వర్‌రెడ్డి శ్రమిస్తున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్మల్‌ ని యోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా ముథోల్‌, ఖానా పూర్‌ నియోజకవర్గాల్లోని కేడర్‌కు అండగా నిలుస్తున్నారు. డీ సీసీ అధ్యక్షుడు రామారావు పటేల్‌కు సహకారం అందిస్తూ ఆయన నేతృత్వంలోనే జిల్లాలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. హైదరాబాద్‌లో బీజీగా ఉంటున్నా నిర్మల్‌కు సమయం కేటాయిస్తూ పార్టీ పరమైన కా ర్యకలాపాలతో పాటు కార్యకర్తలకు సంబంధించిన ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దూకుడును కట్టడి చేసేందుకు పార్టీ ఇమేజ్‌తో పాటు వ్యక్తిగత ఇమేజ్‌ తో అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు నిరాటకంగా కొన సాగిస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చే సుకొని ఆందోళన కార్యక్రమాలు, విమర్శనాస్ర్తాలు సంధిస్తూ పార్టీ మనుగడను నిలబెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అఽధిష్టానం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ పదవిని
అప్ప జెప్పింది. దీంతో మహేశ్వర్‌ రెడ్డి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకే కాకుండా టీఆర్‌ఎస్‌కు పార్టీకి గట్టి ప్రత్యర్థి గా నిలిపేందుకు పావులు కదపడం మొదలుపెట్టా రు. ఈ వ్యూహత్మక ప్రణాళికలో భాగంగానే మొదటగా జిల్లాలో రేవంత్‌ రెడ్డి పర్యటనను చేపట్టారు.
మనస్థాపానికి గురి చేసిన దండోరా వ్యవహారం
ఇంద్రవెల్లిలో నిర్వహించతలపెట్టిన గిరిజన దండోరా వ్యవహారం మహేశ్వర్‌ రెడ్డిని మనస్థాపానికి గురి చేసిందని పలువురు అంటు న్నారు. ఇంద్రవెల్లిలో గిరిజన దండోరా నిర్వహించేందుకు రే వంత్‌ రెడ్డి నిర్ణయించిన అంశం మహేశ్వర్‌రెడ్డికి తెలియజేయకపోవడం నిరాశకు గురిచేసిం ది. చాలామంది సీనియర్‌ నేతలు కూడా పీసీసీ ఛీ ప్‌ నిర్ణయంపై అసం తృప్తి వ్యక్తం చేశార ని చెబుతున్నారు. ఇ దే వ్యవహారం పొలిటికల్‌ అఫైర్స్‌ స మావేశంలో హట్‌ టాఫిక్‌ అయ్యింద న్న ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రె డ్డి వ్యవహార శైలిపై మహేశ్వర్‌ రెడ్డి అంద రి సమక్షంలోనే నిలదీశారని పలువురు అంటున్నారు. తన సహజ రీతిలోనే గి రిజన దండోరాపై రే వంత్‌ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచా రం. అయితే దూకుడు రా జకీయాల ను కొనసాగిస్తున్న రేవంత్‌రెడ్డితోనే మహేశ్వర్‌ రెడ్డి దండోరా విషయమై వాదన కు దిగిన వ్యవహారం రాజకీయ పార్టీ ల్లో చర్చకు దారి తీస్తోంది.
కొత్త చర్చకు దారి!

 ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా నియమింపబడ్డ తరువాత త న రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డి పర్యటనను మొ దట జిల్లాలో నిర్వహింపజేసి పార్టీలో తనకున్న పట్టును నిరూపించుకున్నారని పలువురు అంటున్నారు. రేవంత్‌ పర్యటన జి ల్లాలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా సక్సెస్‌ కావడం ఆ పార్టీ కే డర్‌కు కొత్త ఊపునిచ్చినట్లయ్యింది. అయితే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో మ హేశ్వర్‌రెడ్డి ఏకంగా పీసీసీ ఛీప్‌ని ప్రశ్నించిన వ్యవహారం ప్రస్తుతం రా ష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇంద్రవెల్లిలో చేపట్టనున్న దళి త దండోరా కార్యక్రమ విషయమై మహేశ్వర్‌ రెడ్డి రేవంత్‌రెడ్డిని నిలదీసిన వ్యవహారం రాజకీయవర్గాల్లో హట్‌ టాఫిక్‌ అవుతోంది. మ హేశ్వర్‌ రెడ్డి వాదనకు పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశానికి హాజరైన సీనియర్‌ నేతలంతా సంఘీభావం తెలపడం ప్రా ధాన్యత సంతరించుకుంటోంది.
సయోధ్య కుదుర్చిన సీనియర్లు..

మహేశ్వర్‌ రెడ్డి పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆ పా ర్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో అన్ని తానై వ్యవహరిస్తున్నారు. తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదట జైపాల్‌రెడ్డి వంటి వారితో నిర్మల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ యనపై రాజకీయ పరమైన ఆరోపణలు మాత్రమే ఉన్నా వ్యక్తిగతమైన ఆరోపణలు లేకపోవడం ఇమేజ్‌ పెరిగేందుకు తోడ్పడింది. ఇలాంటి పరి స్థితుల్లో పీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి మహేశ్వర్‌ రెడ్డిని పక్కన పెట్టి ఇంద్రవెల్లి కేంద్రంగా చేపట్టనున్న దళిత దండోరా కార్యక్రమ విషయంపై స మాచారం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర మనస్థాపానికి లోనయ్యారంటున్నారు. సీనియర్‌ నాయకులంతా రేవంత్‌ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డిల మధ్య సయోధ్య కుదుర్చి ఇక నుంచి ఏకపక్ష నిర్ణయాలు కొనసాగకుండా చూసుకుందామని సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని అంటున్నారు. ఇంద్రవెల్లిలో చేపట్టబోయే దళిత దండోరా ఆ పార్టీకి మరింత ఊపునివ్వాలంటే ఉమ్మడిజిల్లాకు చెందిన నేతలందరి సహకారం తప్ప నిసరి అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-08-02T04:01:28+05:30 IST